• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Shikaaru OTT: ఓవైపు పోలీసు భర్తతో కాపురం.. మరోవైపు ప్రియుడితో రొమాన్స్.. ఓటీటీలో క్రేజీ చిత్రం!

  ఓటీటీలో బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలకు, రొమాంటిక్‌ కామెడీ డ్రామాలకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. ఈ తరహా సినిమాలను వారు అసలు మిస్‌ కారు. అయితే సముద్రం లాంటి ఓటీటీలో కొన్ని వందల చిత్రాలు, సిరీస్‌లు ఉంటాయి. ప్రతీ వారానికి సినిమాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దీంతో ఆటోమేటిక్‌గానే కొన్ని మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు మరుగున పడిపోతుంటాయి. అలా ఆదరణకు నోచుకొని ఓ సాలిడ్‌ కంటెంట్‌ చిత్రాన్ని ‘YouSay’ మీకు పరిచయం చేస్తోంది. ఓటీటీ సజీషన్స్‌లో భాగంగా మీ ముందుకు తీసుకొచ్చింది. ఆ చిత్ర విశేషాలు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోంది? అన్న విశేషాలు ఇప్పుడు చూద్దాం.

  ఆ సినిమా ఏదంటే?

  సాయి ధన్సిక, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘షికారు‘ (Shikaaru). కబాలిలో రజనీకాంత్‌ కూతురుగా చేసిన ధన్సిక ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో చేసింది. 2022 జులై 1న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. కొద్ది రోజులకే ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అయితే థియేటర్‌లో కాసుల వర్షం కురిపించకపోవడంతో ఈ సినిమాపై ఓటీటీలోనూ పెద్దగా హైప్‌ రాలేదు. అయితే ఆహాలో ఈ సినిమాను చూసిన వారు.. పాజిటివ్‌గా రెస్పాన్స్ అవుతున్నారు. ఇంతకాలం ఈ సినిమాను ఎలా మిస్‌ చేశాం అని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్‌ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. 

  ‘షికారు’.. కథేంటి

  దీపిక (సాయి ధన్సిక) పెళ్ళైన అమ్మాయి. ఆమె భర్త నరసింహ (కన్నడ కిశోర్) పోలీస్ ఆఫీసర్. భార్యకు శారీరక సుఖం ఇవ్వని నరసింహా చాలా రూడ్‌గా ఆమెతో ప్రవర్తిస్తుంటాడు. భర్తకు తెలియకుండా ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న దీపికకు ఒక రోజు బాబీ (అభినవ్) అనే కుర్రాడు పరిచయమవుతాడు. ఆ తర్వాత అతను ఉద్యోగ నిమిత్తం స్నేహితులతో కలిసి సిటీకి వచ్చి దీపికను కలుస్తాడు. భర్త ఇంటిలో లేని సమయంలో బాబీని రమ్మని దీపిక చెబుతుంది. తీరా అతను వచ్చిన కొద్దిసేపటికే భర్త డ్యూటీ నుండి హఠాత్తుగా ఇంటికి వస్తాడు. పోలీస్ ఆఫీసర్ ఇంటిలో చిక్కుకుపోయిన బాబీ పరిస్థితి ఏంటీ? అతను ఆ ఇంటి నుండి బయటకు రావడానికి మిగిలిన ముగ్గురు స్నేహితులు ఏం చేశారు? అన్నది మిగతా సినిమా.

  సినిమా ఉద్దేశ్యం ఏంటి?

  దర్శకుడు హరి కొలగని.. సమాజంలో చోటుచేసుకుంటున్న ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పెళ్ళి అయిన మహిళల జోలికు వస్తే యువత ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పెళ్లైన యువతికి జీవతంలో సుఖ సంతోషాలు లేకపోతే ఆమె మనసు ఎలా దారి తప్పుతుందో కూడా కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. నిజానికి హీరోయిన్‌కు తప్పు చేయాలన్న ఉద్దేశం లేకపోయినప్పటికీ.. పరిస్థితులు దీపిక చేత కొన్ని పనులు చేయిస్తాయి. భర్తతో రోజూ టార్చర్‌గా అనిపించడం, సంసారం సుఖంగా లేకపోవడంతో ఆమె మదిలో కొత్త ఆలోచనలు వస్తాయి. డైరెక్టర్‌ హరి ఎక్కువగా ఆడల్ట్‌ కంటెంట్‌ చూపించాడు. యూత్‌ను  ఆకట్టుకునే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. అయితే ఆసక్తిలేని కథనం, బోరింగ్‌ సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా మారాయి. 

  Telugu.yousay.tv Rating : 2.5/5 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv