సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. తన లుక్స్ సైతం మార్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు మెుదలవుతుందోనని మహేష్‌తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ప్రస్తుతం ‘SSMB29’ చిత్రానికి సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన లేటెస్ట్ బజ్‌పై మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంతకీ ఏంటా అప్‌డేట్? మహేష్ ఫ్యాన్స్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫ్యాన్స్ కోపానికి కారణమిదే!
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న ‘SSMB29’ ప్రాజెక్ట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మెుదలై చాలా కాలమే అయిన్పపటికీ ఇప్పటి వరకూ ఒక్క అధికారిక ప్రకటన టీమ్ నుంచి రాలేదు. అయితే ఆగస్టు 9 మహేష్ బర్త్‌డే కావడంతో ఆ రోజున ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ కొన్ని రోజులుగా భావిస్తూ వస్తున్నారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఆగస్టు 9న ఈ సినిమాపై ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఉండదని తెలుస్తోంది. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ కోపపడుతున్నారు. జక్కన్న ఇలా చేశాడేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజమౌళి కచ్చితంగా బర్త్‌డే ట్రీట్ ఇస్తారని మరికొందరు ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి మహేష్ బర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కు ఏదైన సర్‌ప్రైజ్ ఉంటుందో లేదో చూడాలి.
సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి!
‘SSMB29’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నట్లు సమాచారం. మిగిలిన కాస్త వర్క్‌ను కూడా ఫినిష్ చేసుకొని సెప్టెంబర్‌లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో మహేష్ ద్విపాత్రిభినయం చేస్తున్నట్లు ఇటీవల నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉంటుందని గాసిప్స్ వినిపించాయి. మహేష్ ఇప్పటివరకూ 28 చిత్రాల్లో నటించగా ఎందులోనూ డబల్ రోల్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయలేదు. దీంతో ఈ అప్‌డేట్ మహేష్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకర్షించింది. మరి ఇందులో వాస్తవం ఎంతో రాజమౌళి టీమ్ తెలియజేయాల్సి ఉంది.
మూడు పార్టులుగా..!
‘SSMB 29’ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో క్రేజీ వార్త కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ మూడు పార్టులుగా రాబోతుందని ఆ రూమర్ తాలుకూ సారాశం. దర్శకుడు రాజమౌళి మూడు పార్ట్స్‌గా తీయాలని మేకర్స్‌కు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ‘SSMB29’లో గ్రాఫిక్స్‌కు ఎక్కువ స్కోప్ ఉండే అవకాశముందని, పైగా కథ చెప్పేందుకు కనీసం మూడు పార్ట్స్ అయినా అవసరం అవుతుందని అంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. రెండు పార్టులుగా రూపొందిన బాహుబలి కోసం జక్కన్న ఐదేళ్ల సమయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మహేష్ చిత్రాన్ని మూడు పార్ట్స్ అంటున్నారు. దీనికి ఇంకెన్నేళ్ల సమయం పడుతుందోనని ఫ్యాన్స్ సమాలోచనల్లో పడ్డారు.
మూవీ టీమ్‌లోకి నాజర్!
ఇటీవల ఓ ఆసక్తికర వార్త కూడా నెట్టింట ట్రెండ్ అయ్యింది. విలక్షణ నటుడు నాజర్ ఈ మూవీలో భాగస్వామి అయినట్లు ప్రచారం జరిగింది. మహేష్‌బాబుతో పాటు పలువురు నటీనటులకు జరుగుతున్న వర్క్ షాప్‌లో నాజర్ పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సంభాషణలు పలికే విషయంలో మహేష్ బాబుకు ఆయన విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలకు కూడా నాజర్ ఇదే తరహా సేవలు అందించారు. ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా సంభాషణలు ఎలా పలకాలో ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు నేర్పించారు. స్వతహాగా థియేటర్ ఆర్టిస్టు అయిన నాజర్ తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి తీసిన బాహుబలిలోనూ బిజ్జలదేవగా తన ఎవర్‌గ్రీన్ నటనతో నాజర్ ఆకట్టుకున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్