• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • SSMB29 Cast: రాజమౌళి బిగ్‌ ప్లాన్‌.. నెగిటివ్‌ రోల్‌లో మహేష్‌.. ఆ రోజున అధికారిక ప్రకటన!

  ఇండియన్‌ ఫిల్మ్‌ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మహేష్‌బాబు (Mahesh Babu), రాజమౌళి (SS Rajamouli) సినిమా ఒకటి. గ్లోబల్‌ స్థాయిలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా రాబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. కానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం పెద్ద ఎత్తున అప్‌డేట్స్‌ చక్కర్లు కొట్టాయి. తాజాగా ‘SSMB29’కు సంబంధించిన మరిన్ని విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

  మహేష్‌ ద్విపాత్రాభినయం

  లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ‘SSMB29’ చిత్రంలో మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడు. మహేష్‌ ఇప్పటివరకూ 28 చిత్రాల్లో నటించగా ఎందులోనూ డబల్‌ రోల్‌ చేయలేదు. అయితే తొలిసారి రాజమౌళి అతడ్ని డ్యూయల్‌ రోల్‌లో చూపించబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పైగా ఇందులోని ఓ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. ఇదే నిజమైతే ‘SSMB29’పై ఉన్న అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని చెప్పవచ్చు. మహేష్‌ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఫుల్‌ మీల్స్‌లా మారనుంది. 

  అధికారిక ప్రకటన ఆ రోజే!

  ‘SSMB29’ సంబంధించి హీరో మహేష్‌బాబు మినహా ఏ ఇతర నటీనటులను దర్శకుడు రాజమౌళి ప్రకటించలేదు. కనీసం ఇప్పటివరకూ సినిమా లాంచింగ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించలేదు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు మాత్రం చురుగ్గా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆగస్టు 9 మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘SSMB29’ సినిమాపై అధికారిక ప్రకటన ఉండొచ్చని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తి కావడంతో పుట్టిన రోజు కానుకగా అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తారని స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. దీంతో మహేష్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ వస్తుందా? ఏదైనా ప్రీవిజువల్‌ టీజర్‌ ఉంటుందా? అని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

  మూవీ టీమ్‌లోకి నాజర్‌!

  తాజాగా మరో ఆసక్తికర వార్త కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది. విలక్షణ నటుడు నాజర్ ఈ మూవీలో భాగస్వామి అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. మహేష్‌బాబుతో పాటు పలువురు నటీనటులకు జరుగుతున్న వర్క్‌ షాప్‌లో నాజర్‌ పాల్గొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంభాషణలు పలికే విషయంలో మహేష్‌ బాబుకు ఆయన విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలకు కూడా నాజర్‌ ఇదే తరహా సేవలు అందించారు. ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా సంభాషణలు ఎలా పలకాలో ప్రభాస్‌, జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు నేర్పించారు. స్వతహాగా థియేటర్‌ ఆర్టిస్టు అయిన నాజర్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి తీసిన బాహుబలిలోనూ బిజ్జలదేవగా తన ఎవర్‌గ్రీన్‌ నటనతో నాజర్‌ ఆకట్టుకున్నారు. 

  విలన్‌గా మలయాళ స్టార్‌!

  ప్రస్తుతం నటీనటుల ఎంపికలో రాజమౌళి నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మహేష్‌ బాబును ఢీకొట్టే ప్రతినాయకుడి కోసం ఆయన చేస్తున్న కసరత్తు దాదాపుగా పూర్తైనట్లు సమాచారం. ‘SSMB29’లో విలన్‌గా మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండొచ్చని అంటున్నారు. కాగా, ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందిన ‘సలార్‌’లోనూ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా చేశారు. తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సలార్‌ ప్రమోషన్స్‌ సందర్భంగా చేసిన ఇంటర్యూలో పృథ్వీరాజ్‌ నటనపై రాజమౌళి ప్రసంశలు కురిపించిన వీడియో అప్పట్లో వైరల్‌ అయ్యింది. 

  మహేష్‌ లేటెస్ట్‌ లుక్‌ వైరల్‌!

  ఇటీవల మహేష్‌ బాబు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి వచ్చారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి మహేష్‌ బయటకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో మహేష్‌ పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో తలపై క్యాప్‌ పెట్టుకుని కనిపించాడు. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్‌ మహేష్‌ లుక్‌కు ఫిదా అవుతున్నారు. ఇది కచ్చితంగా ‘SSMB29’లో మహేష్‌ లుక్‌ అని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి చిత్రం కోసం మహేష్‌బాబు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ తెరపై కనిపించని సరికొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv