• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌.. మరో కీలక పాత్రలో తెలుగు హీరో?

    ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ సక్సెస్ అందుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి సినిమాని మహేష్ బాబు (Mahesh Babu)తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘SSMB29’ చిత్రంలో మహేష్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అది చూసిన మహేష్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. 

    మహేష్ ద్విపాత్రిభినయం!

    లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం రాజమౌళి తెరకెక్కించనున్న ‘SSMB29’ మూవీలో మహేష్‌ ద్విపాత్రిభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా శుభవార్త కానుంది. ఇక ఈ మూవీలో మహేష్‌ చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటి వరకూ చూడని మహేష్‌ను ఈ సినిమాలో చూడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    SSMB29 కథకు ప్రేరణ అతడే!

    మహేష్‌ – రాజమౌళి చిత్రం.. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా కథకు సంబంధించి మాట్లాడారు. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాసే ప్రయత్నం చేశాను. కానీ, రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    నాని స్పెషల్‌ రోల్‌..!

    ‘SSMB 29’ గురించి మరో రూమర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యంగ్‌ హీరో నాని (Nani) ఓ స్పెషల్‌ రోల్‌లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు పాత్రల కోసం రాజమౌళి.. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ నటీనటులను రంగంలోకి దించనున్నారట. ఈ క్రమంలోనే ఒక పాత్ర కోసం నాని పేరును ఫైనల్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజమౌళి, నాని మధ్య మంచి అనుబంధం ఉండటంతో యంగ్‌ హీరో నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై రాజమౌళి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గతంలో రాజమౌళి రూపొందించిన ‘ఈగ’ సినిమాలో నాని నటించాడు. స్క్రీన్‌పైన కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడు. 

    శరవేగంగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు!

    ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్‌ అంటే సెట్స్‌ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్‌తో రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv