• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SSMB29: తప్పును సరిదిద్దుకునే పనిలో రాజమౌళి.. మహేష్‌ మూవీతో ఆ విమర్శలకు చెక్‌!

    ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా హిట్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా? అని యావత్‌ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో దర్శకధీరుడు చాలా బిజీగా ఉన్నారు. అయితే గత చిత్రాలకు భిన్నంగా ‘SSMB29’ కోసం రాజమౌళి వర్క్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ జక్కన్న తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    రాజమౌళి మాస్టర్ ప్లాన్!

    మహేష్‌ బాబు హీరోగా రూపొందనున్న ‘SSMB29’ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి సరికొత్త వ్యూహాంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా జక్కన్న మూవీస్‌లో వీఎఫ్ఎక్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి షూటింగ్‌తో సమానంగా గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం రాజమౌళి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు దర్శకధీరుడు మాస్టర్ ప్లాన్ వేశాడట. ముందుగానే వీఎఫ్ఎక్స్‌కు సంబంధించి షాట్స్‌ను షూట్ చేయాలని భావిస్తున్నారట. అందుకు తగ్గట్లే ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నట్లు సమాచారం. ‘SSMB29’లో గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగానే ఆ సీన్స్‌ షూట్‌ చేసి సదరు వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలకు అప్పగిస్తారట. ఆ తర్వాత మిగిలిన షూటింగ్‌పై రాజమౌళి ఫోకస్‌ పెడతారట. దీనివల్ల ఏక కాలంలో వీఎఫ్‌ఎక్స్‌ పనులు, షూటింగ్‌ పూర్తవుతాయని జక్కన్న భావిస్తున్నట. దీని వల్ల సినిమాను త్వరగా కంప్లీట్‌ చేయవచ్చని మాస్టర్‌ ప్లాన్‌ వేశారట. దీంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. 

    ఆ విమర్శలకు చెక్‌

    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి అగ్రస్థానంలో ఉంటారు. అయితే ఆయన్ను గత కొంతకాలంగా ఓ విమర్శ వెంటాడుతోంది. రాజమౌళి నుంచి సినిమా రావాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు సమయం పడుతుందని అందరూ అంటుంటారు. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతున్న ఆయన నుంచి వచ్చిన చిత్రాలు కేవలం 12 మాత్రమే. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఒక వ్యూహాత్మక అడుగు అని సినీ వర్గాలు అంటున్నాయి. దీని వల్ల ఒకట్రెండు సంవత్సరాల్లో సినిమా రిలీజ్‌ చేసే వీలు పడుతుందని అంటున్నారు. ‘SSMB 29‘ చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించినా 2026 చివరి కల్లా రిలీజ్‌ చేసే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి తరహాలో..

    బాహుబలి‘, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి పిరియాడికల్‌ డ్రామాలను అందించిన రాజమౌళి, మహేష్‌ కోసం కూడా అటువంటి కథనే రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్‌తో రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. 225 ఏళ్ల క్రితం నాటి స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట. సినిమాకు తగ్గట్లుగా నటీనటులని వందల ఏళ్ల నాటి గిరిజన తెగ లుక్స్ తెచ్చేలా రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని నిర్మాత కె.ఎల్‌. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.  అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను బుక్‌ చేసినట్లు చెబుతున్నారు. 

    కథకు ప్రేరణ అతడే!

    మహేష్‌ – రాజమౌళి చిత్రం ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా కథకు సంబంధించి మాట్లాడారు. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాసే ప్రయత్నం చేశాను. కానీ, రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv