వేసవికాలం వచ్చిందంటే వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త చికాకు ఉంటుంది. అసలే ఉక్కపోత ఆపై చెమటలు… ఇక తలపై జుట్టు ఎక్కువగా ఉంటే ఇంక అంతే సంగతి. ఇలాంటి సమయంలో కొన్ని సమ్మర్ హెయిర్ కట్స్ చేయించుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మనకు తెలిసిన చాలామంది క్రికెటర్స్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఓసారి వాటిపై లుక్కేసి కుదిరితే ఫాలో అయిపోండి.
ధోని
విభిన్నమైన హెయిర్ స్టైల్స్‌లో కనిపించడం ధోని ప్రత్యేకత. కానీ, ఈసారి పెద్దగా ప్రయోగాలు చేయలేదు. హెయిర్ షేప్‌ను అలాగే ఉంచి కాస్త తక్కువ జుట్టుతో కనిపిస్తున్నాడు. సైడ్‌లో ప్రొఫెషనల్‌గా కనిపించేలా మెయింటెన్ చేస్తున్నాడు MSD.
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టైల్‌ను వేసవిలో ఫాలో కావచ్చు. సైడ్స్ పూర్తిగా తగ్గించి మధ్యలో తక్కువ జుట్టును ఉంచుకుంటే బెటర్. మీసం, గడ్డం కూడా ట్రిమ్ చేసుకుంటే లుక్ అదిరిపోతుంది. దీంతో పాటు ఉక్కపోత నుంచి ఉపశమనం కలుగుతుంది.
హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రెండ్‌ను ఫాలో అవుతుంటాడు. ప్రస్తుతం హార్దిక్ కూడా వార్నర్ లాంటి హెయిర్ స్టైల్‌ను చేయించుకున్నాడు. సైడ్స్‌ను పూర్తిగా తగ్గించి మధ్యలో మీడియం జుట్టుతో ఉంటే సూపర్ కూల్‌గా ఉంటుంది.
నితీశ్ రాణా
నితీశ్ రాణా ఫ్యాషన్ ఫ్రీక్ అని చెప్పవచ్చు. గతేడాది పర్పుల్ షేడ్ హెయిర్ స్టైల్‌తో కనిపించిన అతడు ఈ సారి పెద్దగా మార్పులు చేయలేదు. నితీశ్‌ది సమ్మర్‌కి సరిగ్గా సరిపోయే అండర్ కట్. ఇలాంటిది మీకు సూట్ అయితే ట్రై చేయవచ్చు.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ లాంటి హెయిర్ కట్ చూడటానికి సూపర్‌గా ఉంటుంది. సైడ్ పూర్తిగా ట్రిమ్ చేసుకొని ఫ్రెంచ్ గడ్డం మెయింటెన్ చేస్తే వేసవిలో ఇక తిరుగుండదు. మీకు ఇలాంటి లుక్ సెట్ అయితే ఆలస్యం లేకుండా చేసుకోండి.
శిఖర్ ధావన్
వేసవి కాలానికి పర్‌ఫెక్ట్ కటింగ్ ధావన్ స్టైల్. అసలు జుట్టు ఉందా లేదా అనేంతలా ట్రిమ్ చేసి మధ్యలో స్టైల్ కోసం లైన్స్ పెట్టారంటే మాములు లుక్ ఉండదు. చిరాకు నుంచి కాస్తైనా తప్పించుకోవాలని అనుకుంటే ధావన్ హెయిర్ కట్ చేయించాల్సిందే.
విరాట్ కోహ్లీ
సమ్మర్‌లో విరాట్ కోహ్లీ హెయిర్ కట్‌ను కూడా ఫాలో కావచ్చు. సైడ్స్ పూర్తిగా ట్రిమ్ చేసుకొని మధ్యలో లైన్ తీసి జెల్ పెట్టారంటే ఇక అదిరిపోతుంది.
మార్క్రమ్
సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్న మార్క్రమ్ సూపర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఫంకీ స్లీక్ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. సైడ్‌లో క్లాసీ లుక్ ఉంచి మధ్యలో బ్యాలెన్స్‌డ్‌గా జుట్టును మెయింటెన్ చేస్తే బాగుంటుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!