• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 24 గంటల్లో 50 మంది మృతి

    హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతర వర్షాల కారణంగా గత 24 గంటల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. శిథిలాల కింద 20 మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం లేదని సీఎం అన్నారు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, కాంగ్రెస్‌ – భాజపా అధ్యక్షులు తమ ప్రభుత్వానికి సాయం చేయాలని కోరారు. Massive devastation due … Read more

    భారీ వరదలు.. తెగిపోయిన కనెక్టివిటీ

    TS: వరంగల్, హనుమకొండ మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. హంటర్ రోడ్, నయీంనగర్ పూర్తిగా నీట మునగడంతో రహదారులు దెబ్బతిన్నాయి. బాధితులు భవనాలపై తలదాచుకుంటున్నారు. వరద నీరు బీభత్సంతో వాహనాలు కొట్టుకు పోయాయి. శివనగర్ బస్తీల్లో నీరు వచ్చి చేరింది. వరంగల్ రైల్వే స్టేషన్ సైతం నీటితో నిండిపోయింది. రాష్ట్ర విపత్తు స్పందన అధికారులు, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. #Warangalfloods full of storm water enter tricities. #Warangalrains #Warangalfloods #TelanganaRains #TelanganaFloodspic.twitter.com/FheMkUtkP6 — Hi Warangal (@HiWarangal) … Read more

    కారు కోసం వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి

    గుజరాత్‌లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. జునాగఢ్ జిల్లాను వరదలు ముంచెత్తడంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వరద తాకిడికి పశువులు, వాహనాలు, మనుషులు కొట్టుకుపోతున్నారు. తన కారు కోసం వెళ్లిన ఓ వ్యక్తి వరదలో కొట్టుకు పోయాడు. కారును ఆపడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందే తండ్రి కొట్టుకుతుండటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యుల కళ్ళ ముందే వరదల్లో కొట్టుకుపోయిన తండ్రి గుజరాత్ – జునాగఢ్ జిల్లాలో కుసురుస్తున్న … Read more

    హిమాచల్‌లో పోటెత్తిన వరదలు

    హిమాచల్‌ ప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేని వానల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. దీంతో బాగిపుల్ ప్రాంతంలో పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. చంబా నుండి వచ్చిన విద్యార్థుల బస్సు పరాశర్ నుండి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదల్లో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డీఎస్పీ సూద్ వెల్లడించారు. Damage reported in #Seraj Valley due to Flash Flood#HimachalPradesh #Monsoon pic.twitter.com/AJc4RQEqdX … Read more

    గువాహతిలో వరద భీభత్సం

    అస్సాం రాజధాని గువాహతిలో వరద భీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడడంతో గువాహతిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రుక్మిణీగావ్, హాతీగావ్‌ ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు నిలిచింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి. #WATCH | Assam: Several areas in Guwahati city face severe waterlogging and flood-like situation due to heavy rainfall … Read more

    వర్షాలతో ఐటీ రాజధాని బెంగళూరు అస్తవ్యస్తం

    కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు చేరి ఐటీ కారిడార్ సహా అనేక లోతట్టు ప్రాంతాలు చెరవులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడి జనాలు రాకపోకలు సాగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. గంటల కొద్ది ట్రాఫిక్ ఏర్పడి అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈనెల 9 వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వానలు బీదర్, కళాబురాగి, విజయపుర, గాడగ్, ధార్వాడ్, హవేరి వంటి ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

    సూరత్‌లో పోటెత్తిన వరదలు

    గుజరాత్ సూరత్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లన్ని చెరవులను తలపించాయి. బుధవారం కురిసిన కుండపోత వానకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండాయి. దీంతో పెట్రోల్ పంప్ సహా అనేక ఇళ్లు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. నీట మునిగిన ఆ ప్రాంతాన్ని మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | Gujarat: Flood-like situation in low-lying areas in Surat, due to heavy rains in the region (17.08) … Read more

    హైదరాబాద్ లో వరద కష్టాలు

    హైదరాబాద్ లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నిజాంపేట, కూకట్ పల్లి బేగంపేట, పాతబస్తీలోని కాలనీలు నీటమునిగాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల నది ప్రవాహాలను తలపిస్తున్నాయి. నడుము లోతు వరకు నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఎటు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వాటిని బయటకు పంపించే మార్గం లేక అవస్థలు పడుతున్నారు.కనీసం నిత్యవసర సరకులు తెచ్చుకోలేని దుస్థితి నెలకొంది.రోడ్లపైన అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. Brahmanwadi area near … Read more

    వ‌ర‌ద‌ల్లో కొట్టుకొపోయిన కారు.. 9 మంది మృతి

    ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాల‌తో న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈరోజు ఉదయం కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా రామ్‌న‌గ‌ర్‌లోని ధేలా నది వ‌ద్ద ఒక కారు కొట్టుకొపోవ‌డంతో 9 మంది మ‌ర‌ణించారు. ఒక‌ బాలిక‌ను సుర‌క్షితంగా ర‌క్షించారు. మ‌రో 5 మంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయార‌ని అధికారులు దృవీక‌రించారు. మృతులంద‌రూ పంజాబ్‌కు చెందిన‌వార‌ని వెల్ల‌డించారు.