• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీలంకకు ఐసీసీ షాక్

    శ్రీలంకకు ICC షాక్‌ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్‌ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది. శ్రీలంక క్రికెట్‌ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

    ‘ఐసీసీకి ఇంగ్లీష్‌లో సమాధానం ఇస్తా’

    వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా ఆడిన నాలుగు మైదానాల్లో రెండింటికి ICC కాస్త తక్కువ రేటింగ్‌ ఇచ్చింది. దీనిపై భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ‘నాకు ఐసీసీ పట్ల గౌరవం ఉంది. అయితే ఇలా రేటింగ్ ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు’ అని హిందీలో పేర్కొన్న ద్రవిడ్‌ వెంటనే ‘ఇలాంటి వాటికి ఇంగ్లీష్‌లోనే సమాధానం ఇస్తా’ అన్నాడు. ‘పిచ్‌ స్పందించిన తీరే కాకుండా ఆటగాళ్ల నైపుణ్యాలనూ పరిశీలించాలి. కేవలం ఫోర్లు, సిక్స్‌లు మాత్రమే చూస్తామంటే కుదరుదు. అలా అనుకుంటే టీ20 వికెట్లను తయారు చేసుకోవచ్చు’ … Read more

    India Lost ICC Trophies: నాకౌట్స్‌లో టీమిండియా చెత్త రికార్డు.. పదేళ్లలో 8 ట్రోఫీలు ఫసక్..!

    2013 తర్వాత టీమిండియా ఏకంగా 8 ఐసీసీ ట్రోఫీలను నాకౌట్స్‌లో కోల్పోయింది. కొన్నింట్లో తుది వరకు వచ్చి ఓడిపోతే, మరికొన్నింట్లో మొదట్లోనే చేతులెత్తేసింది. 2014లో టీ20 వరల్డ్‌కప్‌‌లో మొదలైన పరాభవ ప్రస్థానం.. నిన్న మొన్నటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కొనసాగింది. నాకౌట్స్‌లో పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులకు నిరాశే మిగుల్చుతోంది. 2013 తర్వాత భారత్ ఇప్పటివరకు కోల్పోయిన ఐసీసీ ట్రోఫీలేంటో చూద్దాం. 2014 టీ20 వరల్డ్‌కప్.. గ్రూప్ దశలో ఓటమే ఎరుగకుండా నాకౌట్స్‌లోకి ప్రవేశించింది భారత్. సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించి … Read more

    పుతిన్‌కు ఐసీసీ అరెస్ట్ వారెంట్

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రదేశాల నుంచి పిల్లలను అక్రమంగా రష్యాకు తరలించిన నేరానికి పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా బెలోవాకు కూడా వారెంట్ ఇచ్చినట్లు పేర్కొంది. కాగా ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేయవచ్చని.. కానీ నిందితులను అరెస్ట్ చేసే హక్కు ఏమాత్రం లేదని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిథి స్పష్టం చేశారు.

    ఐసీసీ వీడియోపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

    ఐసీసీ రూపొందించిన ఓ ఇన్‌స్టా వీడియోపై కోహ్లీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇండియా ఫ్యాన్స్ కోసం రోహిత్, రాహుల్, సూర్య కుమార్ యాదవ్, చాహల్‌లతో ఐసీసీ డిజిటల్ విభాగం ఓ వీడియో క్రియేట్ చేసింది. ‘భారత్‌కు మద్దతు తెలిపేందుకు మీరు సిద్ధమా’ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ జాబితాలో విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘విరాట్ లేనిదే టీమిండియా లేదు’, ‘ఇందులో కింగ్(విరాట్) ఎక్కడ?’ అని కామెంట్లు చేస్తున్నారు. సానుకూల దృక్పథంతోనే ఐసీసీ దీనిని రూపొందించినా.. ప్రస్తుతం ఇన్‌స్టాలో … Read more

    మ్యాచ్ కాదు.. అంతకుమించి..

    భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోందని హాలీవుడ్ స్టార్, WWE రెజ్లర్ డ్వేన్ జాన్సన్ అన్నాడు. అది కేవలం మ్యాచ్ కాదని, అంతకుమించి అని ‘ది రాక్’ పేర్కొన్నాడు. ప్రపంచ అత్యుత్తమ ప్రత్యర్థులు ఢీకొనడం థ్రిల్లింగ్‌గా ఉందన్నాడు. కాగా డ్వేన్ జాన్సన్‌తో ఐసీసీ ఒక స్పెషల్ వీడియోతో ప్రమోషన్స్ చేయించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ నెల 23న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ తలపడనున్న సంగతి తెలిసిందే. .@TheRock is #ReadyForT20WC and … Read more