• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కనుబొమ్మలతోనూ ఎన్టీఆర్ నటిస్తాడు: జక్కన్న

  జూ.ఎన్టీఆర్‌పై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. తన కనుబొమ్మలతోనూ నటించగల నటుడు ఎన్టీఆర్ అని జక్కన్న కొనియాడాడు. లాస్ ఏంజెల్స్‌లో RRR ప్రదర్శనలో ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. ‘కొమురం భీముడో నాకు ఫేవరేట్ సాంగ్. ఇప్పటివరకు నేను తెరకెక్కించిన పాటల్లో ఆల్‌ టైం ఫేవరేట్ అంటే ఇదే. ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించాడు. ఆయన కనుబొమ్మలపై కెమెరా పెడితే వాటితోనూ నటించగలడు’ అంటూ తారక్‌ని రాజమౌళి ప్రశంసించాడు. రాజమౌళి నుంచి ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా తారక్ వెల్లడించాడు. ఈరోజు ఈ స్థాయిలో తాను … Read more

  ‘ఎవడు ఫోన్‌ చేసినా Jr. NTR భయపడడు’

  [VIDEO](url):సీనియర్ నటుడు చలపతిరావు సీనియర్‌ ఎన్టీఆర్‌ కాలం నుంచి నందమూరి కుటుంబానికి ఆప్తుడు. జూ. ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం తననెంతో కలచి వేసిందని, నందమూరి కుటుంబం ఓ సభ్యుడిని కోల్పోయిందని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పడు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. అప్పట్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నిర్వహించిన ఓ సేవా కార్యక్రమంలో పాల్గొన్న చలపతిరావు ‘ జూ. ఎన్టీఆర్‌ ఎవరికీ భయపడడు. ఎవడు ఫోన్‌ చేసినా భయపడడు. తాత ఆశయాలను నెరవేర్చుతున్నాడు’ అంటూ చేసిన వ్యాఖ్యలు … Read more

  తెలుగు సినిమా హిట్స్ , ఫ్లాప్స్-2022

  తెలుగు సినీ పరిశ్రమ ఈ ఏడాది భారీ హిట్లను కొట్టింది. ఆర్ఆర్ఆర్‌తో మెుదలైన ప్రభంజనం హిట్-2 చిత్రం వరకు కొనసాగింది. బింబిసార, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు ప్రేక్షకుల్ని టైం ట్రావెల్ చేయిస్తే…సీతారామం లాంటి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం యువతను ఉర్రూతలూగించింది. రెండో అర్ధభాగంలో కార్తీకేయ-2 పాన్ ఇండియా లెవల‌్‌లో హిట్ కొట్టింది. విక్రమ్, కాంతారా వంటి పరభాష చిత్రాలు తెలుగులో విడుదలై సంచలనాలే సృష్టించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ లైగర్ బాక్సాఫీస్ వద్ద … Read more

  19 ఏళ్ల Jr.NTR ప్రభంజనానికి 19 ఏళ్లు

  19 ఏళ్ల వయసులోనే సింహాద్రి వంటి సూపర్‌ హిట్‌ కొట్టిన తర్వాత జూ.ఎన్టీఆర్‌ నుంచి వచ్చిన సినిమా ‘ఆంధ్రావాలా’. పూరీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పెద్ద ఎన్టీఆర్‌ స్వస్థలమైన నిమ్మకూరులో ఈ వేడుక నిర్వహించారు.10 ప్రత్యేక రైళ్లు, వేలల్లో బస్సులు కేటాయించినా ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి ఫ్యాన్స్‌కు సరిపోలేదంటే ఆ జన సంద్రం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. గుడివాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి చేరుకునేందుకు … Read more

  దటీజ్ ఎన్టీఆర్; వీడియో వైరల్

  కర్నాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కు ఇన్ఫోసిస్ చైర్మన్ సుధానారాయణమూర్తి కూడా హాజరయ్యారు. తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోమని నిర్వాహకులు కోరినా ఎన్టీఆర్ కూర్చోలేదు. అక్కడున్న కుర్చీలను తుడిచి సుధామూర్తిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ప్రస్తుతం వైరల్‌గా మారింది. His Simplicity ??❤️#NTRajiniForAppu #NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #NTRForAppu #PuneethRajkumar #DrPuneethRajkumar pic.twitter.com/N8b0R5j3Rr — Appu Cults (@appu_devotees) November … Read more

  జపనీస్‌లో ఎన్టీఆర్ స్పీచ్‌

  “RRR” ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌, రాజమౌళి జపాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఫుడ్‌ను వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఎన్టీఆర్‌ గురించి మనకు తెలియందేముంది…ఏక సంథాగ్రాహి. ఒక్కసారి విన్నాడంటే పట్టేస్తాడు. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఇప్పుడు జపనీస్‌లోనూ మాట్లాడుతున్నాడు. జపాన్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ జపనీస్‌లో మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. NTR speaking in Japanese … Read more

  ‘జనతా గ్యారేజ్’కి ఆరేళ్లు.. డైలాగ్ గుర్తుందా..!

  ‘జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును’ డైలాగ్ గుర్తుందా. జూనియర్ ఎన్టీఆర్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన ‘జనతా గ్యారేజ్’లోనిదిది. ఈ సినిమా విడుదలై ఆరేళ్లు పూర్తయింది. సామాజిక అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అటు క్లాస్.. ఇటు మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఇందులోని ‘పక్కా లోకల్’ ఐటమ్ సాంగ్ కుర్రకారును ఊపేసింది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ఇంట్రెస్టింగ్ సీన్ కోసం Watch On బటన్ … Read more

  అభిమాని కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్

  జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్‌ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం కొందరు అభిమానుల ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్.. వారి సహాయంతో బాధితుడి కుటుంబంతో ఫోనులో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మనమందరం దేవుడిని ప్రార్ధిద్దామని, జనార్దన్ త్వరలోనే కోలుకుని వస్తాడని, మీరు అధైర్య పడొద్దని అన్నారు. అనంతరం జనార్దన్‌తో మాట్లాడి.. నిన్ను చూడాలని ఉందని, త్వరగా కోలుకుని వచ్చెయ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.