• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు

  ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాలం చెల్లిన ఫోన్లు పని చేయవు వాటిని ఎన్ని సార్లు స్విచ్‌ఆన్ చేసినా బటన్లు నొక్కిన ఫలితం ఉండదు. కాంగ్రెస్‌ది కూడా ఇప్పడు అలాంటి పరిస్థితే. 2014లో కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నట్లు కాంగ్రెస్‌ను వదిలించుకున్నారు. ఈ దేశానికి సాయం చేసే గొప్ప అవకాశాన్ని మాకు కల్పించారు’ అని మోదీ చెప్పుకొచ్చారు.

  పాలస్తీనా పౌరుల మృతిపై మోదీ సంతాపం

  పాలస్తీనియన్‌ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో భారత్ ప్రధాని మోదీ మాట్లాడారు. గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో పౌరుల ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల సంతాపాన్ని తెలిపారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు భారత్‌ మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. గాజాలో ఉగ్రవాదం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళనను వ్యక్తం చేశారు ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటిస్తామని మోదీ పేర్కొన్నారు. .

  పాలస్తీనా పౌరుల మృతిపై మోదీ సంతాపం

  పాలస్తీనియన్‌ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో భారత్ ప్రధాని మోదీ మాట్లాడారు. గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో పౌరుల ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల సంతాపాన్ని తెలిపారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు భారత్‌ మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. గాజాలో ఉగ్రవాదం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళనను వ్యక్తం చేశారు ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటిస్తామని మోదీ పేర్కొన్నారు. .

  రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్

  దేశంలోని రైతులకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.2 వేలు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే కేంద్రంపై రూ.20వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది.

  మోదీ స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం: KTR

  జనగర్జన సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మోదీ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ సినిమాలకు స్టోరీలు రాస్తే ఆస్కార్ విజయం సాధిస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు సీఎంగా కేసీఆర్‌నే ఎన్నుకుంటారని చెప్పారు. ‘ఎన్డీయేలో చేరేందుకు మాకు పిచ్చికుక్క కరిచిందా? సభలో మోదీ పచ్చి అబద్దాలు చెప్పారు. మునిగిపోయో నావలో ఎవరూ ఎక్కాలనుకోరు. నేను సీఎం కావడానికి మోదీ పర్మీషన్ అవసరం లేదు’ అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

  తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు

  తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిజామాబాద్, ఆదిలాబాద్ రైతుల కలను నిజం చేస్తూ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే రూ.900కోట్లతో ములుగు జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీగా నామకారణం చేస్తున్నట్లు వెల్లడించారు. మహాబూబ్ నగర్‌లో ఉన్న ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. https://x.com/TeluguScribe/status/1708422922199826539?s=20

  బైడెన్‌ భార్యకు మోదీ అదిరిపోయే గిఫ్ట్‌!

  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బైడెన్​ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. ఈ క్రమంలో పురాతన అమెరికన్‌ బుక్‌ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్‌ బహూకరించారు. మరోవైపు జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. అనంతరం ఇరువురూ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. వైట్​హౌస్​లో ప్రవేశించే ముందు బైడెన్​ దంపతులు, మోదీ ఫొటోలకు పోజులిచ్చారు. #WATCH | Prime Minister … Read more

  తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రధాని

  ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అంత్యక్రియలు గుజరాత్‌లో పూర్తయ్యాయి. మోదీ తన తల్లి చితికి నిప్పంటించారు. చేతులు జోడించి తల్లికి నమస్కరించి అంతిమ సంస్కారులు నిర్వహించారు. తల్లి పాడె మోసుకువెళ్లారు. సోదరుడు, కుటుంబ సభ్యులతో కలిసి తుది వీడ్కోలు పలికారు. గాంధీనగర్‌లోని సెక్టార్‌ 30 శ్మశానవాటికలో జరిగిన అంతిమక్రియల్లో మోదీ కుటుంబ సభ్యులతోపాటు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

  తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ

  [VIDEO](url): ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాని తల్లి పాడె మోశారు. కాసేపట్లో మాతృమూర్తికి మోదీ దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇటీవలే 100వ జన్మదినం జరుపుకున్న హీరాబెన్‌…అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. #WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi carries the mortal remains of his late mother Heeraben Modi who passed away at the age of 100, today. pic.twitter.com/CWcHm2C6xQ — ANI (@ANI) December … Read more

  మలైకా అరోరారో మోదీ వీడియో వైరల్‌

  [VIDEO](url):50 ఏళ్ల వయసులోనూ తన ఒంపు సొంపులతో కుర్రకారు మతి పోగొడుతున్న నటి మలైకా అరోరా. ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌లో లివ్‌ఇన్‌లో ఉంది. అయితే తాజాగా మోదీ ఈ బ్యూటీని కలిసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మోదీ ఈవిడను ఎక్కడ కలిశారని అవాక్కవండి. మలైకాను కలిసింది మోదీలా కనిపించే మరోవ్యక్తి అచ్చం మోదీ లాగానే సూట్‌ హెయిర్‌స్టైల్‌ గడ్డంతో ఉండే ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post … Read more