• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భాజపాకు నటి గౌతమి రాజీనామా

    చెన్నై: భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి గౌతమి ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం లభించడం లేదని తెలిపారు. పైగా ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన వ్యక్తికి కొంతమంది సీనియర్‌ నేతలు అండగా నిలిచినట్లు ఆరోపించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇస్తానని చెప్పి మెుడిచెయ్యి చూపించారని గౌతమి అన్నారు. కాగా, స్థిరాస్తుల విషయంలో తనను అళగప్పన్‌ అనే వ్యక్తి మోసం చేశాడని ఇటీవల ఆమె పోలీసులకు … Read more

    యువకుడి ఖాతాలో రూ.753 కోట్లు

    తమిళనాడులోని తంజావూరుకి చెందిన ఓ యువకుడి ఖాతాలోకి ఒక్కసారిగా రూ.756 కోట్ల నగదు జమ అయ్యింది. గమనించిన మహ్మద్‌ ఇక్రీష్‌.. సంబంధిత బ్యాంక్‌ సేవా కేంద్రానికి సమాచారం ఇచ్చాడు. దీంతో బ్యాంక్‌ వర్గాలు అతడి ఖాతాను సీజ్‌ చేశాయి. సొమ్ము వచ్చిందని చెబితే చివరకి తన ఖాతానే సీజ్‌ చేయడంపై యువకుడు షాక్‌ గురయ్యాడు. దీనిపై బ్యాంక్‌ అధికారులను సంప్రదించినా పట్టించుకోలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని అతడు మీడియా ముందుకు తీసుకొచ్చాడు.

    తమిళనాడు- కర్ణాటక మధ్య ఉద్రిక్తత

    తమిళనాడు- కర్ణాటక సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కావేరి నది జలాల విడుదలను నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా బంద్ తలపెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలు వరుస ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. https://x.com/appudynasty1/status/1705808522603315601?s=20

    గవర్నర్‌ని ప్రశ్నిస్తూ వెలిసిన పోస్టర్లు

    తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. ఆ రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, గవర్నర్‌ని ప్రశ్నిస్తూ రాష్ట్రంలో పోస్టర్లు వెలిశాయి. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం సమీపంలో పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అంటించారు. నేర చరిత్ర కలిగిన కేంద్ర మంత్రుల జాబితాను ఇందులో ప్రచురించడం గమనార్హం. గవర్నర్ ఆర్.ఎన్.రవిని ప్రశ్నిస్తూ వీటిపై సమాధానమేంటని పోస్టర్లలో నిలదీశారు. #WATCH | Tamil Nadu: DMK supporters stick posters near Anna Arivalayam, DMK headquarters in Chennai, raising … Read more

    కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి

    తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్‌ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. దాంతో బైక్‌ ఎగిరి వచ్చి దాని వెనుకాలే వెళ్తున్న ట్రావెలర్‌ వాహనంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో … Read more

    నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

    తమిళనాడులోని కారైకుడి జిల్లాలో దారుణం జరిగింది. 29 ఏళ్ల వ్యక్తిని ఐదుగురు నరికి చంపారు. బాధితుడు మధురై వాసి వినీత్‌గా గుర్తించారు. వినీత్‌ రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు వినీత్‌ను చుట్టుముట్టారు. తప్పించుకునే క్రమంలో వినీత్‌ కిందపడిపోగా నిందితులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అయింది. దాడి సమయంలో ఓ వ్యక్తి రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. பட்ட பகல்ல இப்புடி ஓட விட்டு வெட்டுறானுங்க ? காவல்துறை இவனுங்களா … Read more

    సముద్రం లోపల బంగారం సీజ్

    ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చేసిన సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. సముద్రంలో దాచిన 32.689 కిలోల బంగారాన్ని వెతికి మరీ కనిపెట్టారు. తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏరియాలో రెండు ఫిషింగ్ బోట్లు బంగారాన్ని దాచినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో డీఆర్ఐ, కస్టమ్ అధికారులతో కలిసి కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్‌ని చేపట్టారు. సముద్రం లోనికి స్కూబా డైవింగ్ చేసి అక్కడ దాచిన బంగారాన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.20.2 కోట్లు ఉంటుందని అంచనా. శ్రీలంక … Read more

    కార్యకర్తను మెడపట్టి గెంటేసిన మంత్రి

    తమిళనాడు యువజన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కరచాలనం చేసేందుకు వచ్చిన ఓ కార్యకర్తని పక్కనే ఉన్న మరో మంత్రి మెడపట్టి పక్కకు తోసేశారు. సేలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్‌ని కలిసేందుకు కార్యకర్తలు పోటెత్తారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ఓ కార్యకర్తను మెడపట్టి తోసేశారు. ఈ వీడియోను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై షేర్ చేస్తూ.. ప్రజలను కొట్టడమే మంత్రులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణ కవచాలు సరఫరా చేయాలని సీఎంని అన్నామలై … Read more

    పొన్నియ‌న్ సెల్వ‌న్‌-1పై సీనియ‌ర్ సిటిజ‌న్ల ఆస‌క్తి

    మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘పొన్నియ‌న్ సెల్వ‌న్-1’ సినిమా సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను చూసేందుకు సాధార‌ణ ప్రేక్ష‌కులు ఆస్తిక‌రంగా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఇన్నిరోజులు ఇంటికే ప‌రిమిత‌మైన సీనియ‌ర్ సిటిజ‌న్లు కూడా ఈ మూవీని థియేట‌ర్ల‌లో చూడాల‌నుకుంటున్నార‌ట‌. త‌మిళ‌నాడులో ముఖ్యంగా ఈ ర‌క‌మైన టాక్ వినిప‌స్తుంది. మ‌ణిర‌త్నం సినిమాల‌కు ఉండే క్రేజ్ అలాంటిది మ‌రి. దాంతోపాటు ఆయ‌న‌ మొద‌టిసారిగా ఇలా యుద్ధానికి సంబంధించిన చారిత్రాత్మ‌క క‌థ‌ను తెర‌కెక్కించ‌డం, ప్ర‌ముఖ తార‌లు అంద‌రూ న‌టించ‌డం కూడా ముఖ్య కార‌ణంగా క‌నిపిస్తుంది.