అసదుద్దీన్ ఓవైసికి బండి సంజయ్ సవాల్
MIM అధినేత అసదుద్దీన్ ఓవైసికి టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాలు విసిరారు. దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసి తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేయాలని సవాలు విసిరారు. అప్పుడు చూద్దాం ఎన్ని స్థానాల్లో డిపాజిట్లు వస్తాయోనని ఎద్దేవా చేశారు. ప్రతిసారి బీజేపీపై విమర్శలు గుప్పించడం కాదని ఎంఐఎం సత్తా ఏంటో నిరూపించుకోవాలన్నారు. మతవిద్వేశాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసేది MIM నేతలేనని ఆరోపించారు.