గత కొన్ని నెలలతో పోలిస్తే ఆగస్టులో గణనీయంగా పెద్ద హీరోల చిత్రాలు రిలీజయ్యాయి. ఆగస్టు చివరి వారంలోనూ ఓ స్టార్ హీరో చిత్రం విడుదలకు సిద్ధమైంది. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ థియేటర్లలోకి రానున్న కొత్త చిత్రాలు ఏవి? ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న చిత్రాలు, సిరీస్‌లు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
సరిపోదా శనివారం
నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం‘ (Saripodhaa Sanivaaram Movie). వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక అరుళ్ మోహన్ చేసింది. ప్రముఖ తమిళ నటుడు ఎస్.జే. సూర్య ఇందులో ప్రతినాయకుడి పాత్ర చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
అహో! విక్రమార్క
మగధీర విలన్‌గా నటించి నటుడు దేవ్ గిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై మరికొన్ని తెలుగు చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కథానాయకుడిగా చేసిన తాజా చిత్రం ‘అహో! విక్రమార్క’ (Aho Vikramaarka Movie). త్రికోటి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 30న విడుదల కానుంది. ఇందులో దేవ్‌గిల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది.
మాస్ సినిమా రీ-రిలీజ్
నాగార్జున కెరీర్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ‘మాస్’ (Mass Movie) ఒకటి. ‘దమ్ముంటే కాస్కో’ అనేది క్యాప్షన్. డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ డైరెక్షన్లో 2004లో విడుదలైన ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతింగా ఆకర్షించింది. మంచి వసూళ్లను సైతం రాబట్టింది. అయితే ఆగస్టు 29న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ‘మాస్’ రీ-రిలీజ్ కాబోతోంది. దీంతో అక్కినేని అభిమానులు ఈ రీ-రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
ఐసీ814:ది కాంధార్ హైజాక్
ప్రపంచంలోనే అతిపెద్ద హైజాక్‌గా నిలిచిన ఓ రియల్ స్టోరీ ఆధారంగా ‘ఐసీ814:ది కాంధార్ హైజాక్’ (IC 814 The Kandahar Hijack) సిరీస్ రూపొందింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 29వ తేదీ నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 1999లో సుమారు 188మంది ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814ను ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ప్రయాణికులను దాదాపు 7రోజుల పాటు బందీలుగా ఉంచారు. ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ ఘటనల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన సిరీస్ కావడంపై ‘ఐసీ814:ది కాంధార్ హైజాక్’ సిరీస్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
No Gain No Love | Series | English/Korean | Amazon | Aug 26 |
Lord Of The Rings 2 | Series | English | Amazon | Aug 29 |
The Deliverance | Series | English | Netflix | Aug 30 |
Breathless | Series | English | Netflix | Aug 30 |
Abigail | Movie | English | Jio Cinema | Aug 26 |
Godzilla x Kong: The New Empire | Movie | English | Jio Cinema | Aug 26 |
Murshid | Series | Hindi | Zee 5 | Aug 30 |
Only Murders In the Building 4 | Series | English | Hotstar | Aug 27 |
Kana Kaanum Kaalangal | Series | Tamil | Hotstar | Aug 30 |
Twisters | Movie | English | Book My Show | Aug 30 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్