• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu OTT Releases: ఈ వారం (మే 15) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 14-21వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:

    అన్ని మంచి శకునములే

    యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మాళవిక నాయర్ జంటగా చేసిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా మే 18న రిలీజ్ కానుంది.  ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించింది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. 

    బిచ్చగాడు-2

    ‘బిచ్చగాడు’ సినిమాతో హీరో విజయ్‌ ఆంటోని తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్‌ కూడా విజయ్‌ తెరకెక్కించాడు. బిచ్చగాడు-2 పేరుతో దానిని 19న ధియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్‌ అంటోని ద్విపాత్రాభినయం చేసినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌తో పాటు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.

    ఫాస్ట్‌ X 

    ఫాస్ట్‌ అండ్‌ ఫూరియస్‌ నుంచి మరో సిరీస్‌ ఈ వారం రానుంది. విన్‌ డీజిల్‌ ప్రధాన పాత్రలో.. జాసన్‌ మొమోవా ప్రతినాయకుడిగా ఫాస్ట్‌ X ను తెరక్కించారు. జస్టిన్‌ లిన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కూడా మే 19న విడుదల కానుంది. కార్లతో దుమ్ము రేపే పోరాటాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్‌ ఎపిసోడ్లతో ప్రేక్షకులను సీటు అంచులకు తీసుకొచ్చే ఈ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

    ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

    ఏజెంట్‌

    భారీ అంచనాలతో రిలీజైన అఖిల్‌ లేటెస్ట్ మూవీ ఏజెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు సోనీలివ్‌ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయిక. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు. మరి ఓటీటీలోనైనా ఏజెంట్ చిత్రం ఆకట్టుకుంటుందేమో చూడాలి. 

    డెడ్‌ పిక్సెల్స్‌

    వివాహానంతరం నిహారిక కొణిదెల నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘డెడ్‌ పిక్సెల్స్‌’. నిహారికతో పాటు వైవా హర్ష, అక్షయ్‌ లింగుస్వామి, సాయి రోణక్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో గేమ్‌లకు యువత ఎంతగా ప్రభావితమవుతుందో ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. 

    ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు… 

    TitleCategoryLanguagePlatformRelease Date
    Ant Man and Wasp: QuantumaniaMovieEnglishDisney+ HotstarMay 17
    Modern Love ChennaiSeriesTamilAmazon PrimeMay 18
    kadina kadoramee andakadahamMovieTamilSony LIVMay 19
    AyalvashiMovieMalayalamNetflixMay 19
    KathalMovieHindiNetflixMay 19
    Bayi AjaibMovieEnglishNetflixMay 19
    MutedMovieEnglishNetflixMay 19
    faithfully yoursMovieEnglishNetflixMay 17
    Selling Sunset: Season 6SeriesEnglishNetflixMay 19
    Young, Famous & African: Season 2SeriesEnglishNetflixMay 19
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv