• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Thangalaan Telugu Review: విక్రమ్‌ కెరీర్‌లోనే మరో మైలురాయి చిత్రం.. ‘తంగలాన్‌’ ఎలా ఉందంటే?

    నటీనటులు: విక్రమ్‌, మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు

    దర్శకత్వం: పా.రంజిత్‌

    సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌

    ఎడిటింగ్‌: సెల్వ ఆర్‌.కె.

    సినిమాటోగ్రఫీ: ఎ.కిషోర్‌ కుమార్‌

    నిర్మాతలు: కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, పా.రంజిత్‌, జ్యోతి దేశ్‌ పాండే

    విడుదల: 15-08-2024

    అపరిచుతుడు’, ‘’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగులోనూ పాపులర్‌ అయిన నటుడు విక్రమ్‌ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘తంగలాన్‌‘ చిత్రంలో ఆటవిక మనిషిగా విక్రమ్‌ కనిపించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్‌ తనను తాను మార్చుకున్న తీరు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌, టీజర్‌ కూడా వాటిని రెట్టింపు చేసింది. ఆగస్టు 15న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. మరీ తంగలాన్ ఎలా ఉంది? విక్రమ్‌ మరోమారు తన నటనతో మెస్మరైజ్‌ చేశాడా? సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్‌) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్‌కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్‌ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే?

    తంగలాన్ పాత్రలో విక్రమ్‌ అదరగొట్టేశారు. అతడు తప్ప మరొకర్ని ఊహించుకోలేనంతగా ఆ పాత్రపై ప్రభావం చూపించారు. ఆదివాసిలా తను కనిపించిన తీరు, పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఇది విక్రమ్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా చెప్పవచ్చు. తంగలాన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు ఉన్నంతలో పర్వాలేదనిపించింది. నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవిక మోహనన్ కెరీర్ బెస్ట్‌ నటనతో ఆకట్టుకుంది. తన లుక్స్‌, నటనతో ఆడియన్స్‌ను భయపెట్టింది. విక్రమ్‌ తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్‌ చూపిన పాత్ర ఆమెదే. విక్రమ్‌తో ఆమె చేసే యాక్షన్‌ హంగామా అలరిస్తాయి. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    తంగలాన్‌ చిత్రం ప్రధానంగా బంగారం అన్వేషణ చుట్టూ తిరిగినా అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం చేసే పోరాటంగా దర్శకుడు పా.రంజిత్ ఈ మూవీని తెరెక్కించారు. బ్రిటిషర్ల కాలంలోని వర్ణ వివక్షను కళ్లకు కట్టారు. కథ చెప్పేందుకు దర్శకుడు సృష్టించిన ప్రపంచం, ప్రజల వస్త్రధారణలు ఆడియన్స్‌ను కొత్త లోకానికి తీసుకెళ్తాయి. బిటిషర్లతో కలిసి తంగలాన్‌ బంగారం వేటకు వెళ్లడం, ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు ఉత్కంఠను రేపుతాయి. విరామంలో వచ్చే సీన్స్‌ సెకండాఫ్‌పై మరింతగా అంచనాలు పెంచేస్తాయి. అయితే సెకండ్‌ పార్ట్‌కు వచ్చే సరికి కథ గాడితప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో బ్రిటిషర్లు-తంగలాన్-నాగజాతి తెగకు మధ్య జరిగే పోరు గందరగోళానికి గురిచేస్తుంది. ఏది తంగలాన్‌ ఊహో, ఏది నిజమో తెలియక ఆడియన్స్‌ కన్ఫ్యూజ్‌ అవుతారు. అయితే క్లైమాక్స్‌లో తంగలాన్‌ పాత్రలోని మరో కోణం చూపించి దర్శకుడు మంచి ముగింపును ఇచ్చాడు. 

    టెక్నికల్‌గా

    ఈ చిత్రం సాంకేతికంగా చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాయి. అలాగే కథకు తగ్గట్లుగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ, కథనం
    • విక్రమ్‌, మాళవిక నటన
    • ఫాంటసీ ఎలిమెంట్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • సెకండాఫ్‌లోని సాగదీత సీన్స్‌
    • స్లో నారేషన్‌

    Telugu.yousay.tv Rating : 3/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv