‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తమిళ నటుడు విక్రమ్ తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. ఇటీవల వచ్చిన ‘తంగలాన్’ చిత్రంలోనూ ఆటవిక మనిషిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్ తనను తాను మార్చుకున్న తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని గత కొన్ని రోజులగా సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్!
చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ (Thangalan) పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో థియేటర్స్‌లో విడుదలై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎక్స్‌పెక్ట్ చేసినంత సక్సెస్‌ను అందుకోకపోవడంతో ‘తంగలాన్’ ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముందుగా ఒప్పందం చేసుకున్న మొత్తానికి కాకుండా తక్కువకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇవ్వాలని నిర్మాణ సంస్థను డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరో ఓటీటీలో రిలీజ్?
ఓటీటీ రైట్స్ తక్కువకు ఇవ్వాలన్న నెట్‌ఫ్లిక్స్ డిమాండ్‌కు తంగలాన్ నిర్మాతలు ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఎంతకూ పంతం వీడకపోవడంతో మరో ఓటీటీ సంస్థకు ‘తంగలాన్’ను ఇచ్చే ప్రయత్నాలను నిర్మాతలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ తంగలాన్ ఓటీటీలోకి రావడమే కష్టమే అని చెప్పవచ్చు. దీంతో ఓటీటీలో తంగలాన్ కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్‌కు ఇది పెద్ద షాకే.
కలెక్షన్స్ నిల్!
ప్రముఖ తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తంగలాన్ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్టెత్‌తో నిర్మించారు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈజీగా రూ.150 కోట్ల పైనే వసూలు చేస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా రూ.105 కోట్ల గ్రాస్‌ను మాత్రమే అందుకుంది. కేవలం రూ.70 కోట్ల నెట్ వసూళ్లను సాధించగలిగింది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా విక్రమ్ నటనపై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురిశాయి. నటన పరంగా ‘తంగలాన్’ అతడి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. దీంతో ఓటీటీలోనైనా ఈ సినిమాను వీక్షించాలని అంతా భావించగా నెట్‌ఫ్లిక్స్ వారికి నిరాశనే మిగిల్చింది.
కథేంటి
1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్‌కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!