• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    అర్జున్ రెడ్డి సినిమా విజయంతో రౌడీ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గీతాగోవిందం, ఖుషి వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న  విజయ్ దేవరకొండ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు మీకోసం..

    విజయ్ దేవరకొండ అసలు పేరు?

    దేవరకొండ విజయ్ సాయి. అభిమానులు ముద్దుకు రౌడీ బాయ్, VDK అని పిలుచుకుంటారు.

    విజయ్ దేవరకొండ ఎత్తు ఎంత?

    5 అడుగుల 10 అంగుళాలు

    విజయ్ దేవరకొండ తొలి సినిమా?

    నువ్విలా చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు

    విజయ్ దేవరకొండ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్?

    అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గీతాగోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి సినిమాలు హిట్స్‌గా నిలిచాయి.

    విజయ్ దేవరకొండ క్రష్ ఎవరు?

    ఖుషి సినిమాలో తనతోపాటు నటించిన సమంత తన క్రష్‌గా విజయ్ ఓ సందర్భంలో చెప్పాడు

    VDKకు ఇష్టమైన కలర్?

    తెలుపు, బ్లాక్, బ్రౌన్

    విజయ్ దేవరకొండ పుట్టిన తేదీ?

    మే 9, 1989

    విజయ్ దేవరకొండకు నచ్చిన పుస్తకం?

    విజయ్ దేవరకొండ పుస్తక ప్రియుడు. అతనికి ‘ది పౌంటెన్ హెడ్’ అనే పుస్తకం అంటే ఇష్టమని చెప్పాడు. ఈ పుస్తకంతో పాటు ‘అట్లాస్ ష్రగ్ డ్’, ‘హూ మూవ్డ్ మై చీజ్’ అనే పుస్తకాలు చదవదగినవని పేర్కొన్నాడు.

    విజయ్ దేవరకొండకు లవర్ ఉందా?

    విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ప్రేమలో ఉన్నారని చాలా వార్తల్లో వచ్చాయి. వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కనిపించడం ఆ వార్తలకు బలానిచ్చాయి. గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాల్లో ఈ జోడి నటించింది.

    విజయ్ దేవరకొండ వ్యాపారాలు?

    రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ ఉంది. ఈ బ్రాండ్ బట్టలు మింత్రా ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. వోల్ట్స్‌ అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. 

    విజయ్ దేవరకొండకు ఎన్ని అవార్డులు వచ్చాయి?

    అర్జున్ రెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. 2018 ఫోర్బ్స్ ఇండింయా సెలబ్రెటీ 100 జాబితాలో 72వ స్థానం, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో 4 వ స్థానంలో నిలిచాడు.

    విజయ్ దేవరకొండ సామాజిక సేవ చేస్తాడా?

    కొవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా వంట సామాగ్రిని అందించాడు. ఇందుకోసం రూ.1.7కోట్లు ఖర్చు పెట్టాడు. ఖుషి సినిమా విడుదల సమయంలో తన రెమ్యునరేషన్‌ నుంచి రూ.కోటి ఖర్చు పెట్టి 100 మంది రైతులకు సాయం చేశాడు

    విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాల్లో నటించాడు?

    విజయ్ దేవరకొండ 2024 వరకు 14 సినిమాల్లో నటించాడు. 

    విజయ్ దేవరకొండకు ఇష్టమే ఆహారం?

    చికెన్ బిర్యాని, ఇటాలియన్ పస్తా అండ్ పీజా, కాఫీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv