• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డేటింగ్ యాప్‌తో యువకుడికి టోకరా

    డేటింగ్ యాప్స్.. అప్పుడే యవ్వనంలోకి వచ్చిన యువతీ, యువకులు వీటి పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ వీటి ద్వారా అనేక రకాల అరాచకాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా డేటింగ్ యాప్ ద్వారా జరిగిన అరాచకం గురించి తెలిస్తే వామ్మో అని గుండె పట్టుకుంటారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఉండగా.. ఒక రోజు సదరు యువతిని కలిసేందుకు ఆ యువకుడు వెళ్లాడు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అక్కడికి వెళ్లగానే ఆ యువకుడిని స్పృహ కోల్పోయేలా తల మీద బలంగా బాదారు. తర్వాత ఆ యువకుడిని బంధించి అతడి వద్ద ఉన్న నగదు, నగలు మొత్తం లూటీ చేశారు. అంతే కాకుండా అతడి బ్యాంక్ అకౌంట్లను కూడా ఊడ్చేశారు. ఇక్కడితో విడిచి పెట్టారా.. అంటే అదీ లేదు. అణ్యం పుణ్యం తెలియని ఆ యువకుడిని న్యూడ్‌గా వీడియో తీసి డబ్బుల కోసం పలు మార్లు బెదిరించారు. ఇదంతా ఒకెత్తయితే ఆ యువకుడు చూసింది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమ్మాయిగా పరిచయమైన ఆ యువతి అసలు అమ్మాయే కాదట. తను ఒక ట్రాన్స్‌జెండర్. తర్వాత కూడా అనేక సార్లు అతడిని డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో అతడు విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ట్రాన్స్‌జెండర్‌ను అరెస్ట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv