నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం చంద్రబాబు, దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్లు రిలీజై ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో ఈ వేదికపై సందడి చేశారు. ఆయనెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య. తన అప్‌కమింగ్ మూవీ ‘కంగువా’ (Kanguva) ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య ఈ కార్యక్రమానికి తన టీమ్‌తో వచ్చారు. బాబీ డియోల్, దర్శకుడు శివ కూడా బాలకృష్ణతో సరదాగా గడిపారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా అందులో తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సూర్య సీక్రెట్ రివీల్ చేసిన కార్తీ!
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కూడా ఫుల్ జోష్‌తో అలరిస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి హీరో సూర్య (Suriya) హాజరై సందడి చేశారు. తన తమ్ముడు కార్తి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టీజర్ ఆరంభంలో సూర్య ఎంట్రీ ఇస్తుండగా బాలయ్య తన వద్ద ఉన్న(Unstoppable Season 4) కళ్లద్దాలను సూర్యపైకి విసురుతాడు. దానిని క్యాచ్ చేసిన సూర్య బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్‌గా షోలోకి ఎంట్రీ ఇస్తాడు. తర్వాత కార్తి మీ నంబర్‌ను ఏమని సేవ్ చేసుకుంటారని బాలయ్య అడగ్గా ‘అది అవుట్‌ఆఫ్ సిలబస్’ అంటూ మొదటి ప్రశ్నతోనే సూర్య నవ్వులు పూయించారు. మొదటి క్రష్ ఎవరో చెప్పాలని కోరగా ‘వద్దు సర్ ఇంటికి వెళ్లాలి, గొడవలు అవుతాయని’ సరదాగా చెప్పారు. ఇక బాలకృష్ణ కార్తికి లైవ్‌లో ఫోన్ చేసి సూర్య గురించి అడగ్గా ఒక హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని చెప్పారు. దీంతో కార్తిని సూర్య ‘నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా’ అని సూర్య అన్నారు.
కంటతడి పెట్టిన సూర్య
తాజా టీజర్ (Unstoppable Season 4)లో జ్యోతిక గురించి కూడా సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య ఎమోషనల్ అయ్యారు. మరోవైపు సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ఈ ఎపిసోడ్‌లో ప్రస్తావనకు వచ్చింది. సూర్య సాయం చేసిన యువతి వీడియోను ఇందులో ప్లే చేశారు. అనంతరం సూర్య మాట్లాడుతూ మానవత్వం ఉన్న ఓ సగటు మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో సూర్య కళ్లు చెమడ్చాయి. దీంతో బాలయ్యతో పాటు అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఇక చివర్లో ‘కంగువ’లో విలన్‌గా చేస్తున్న బాబీ డియోల్, డైరెక్టర్ శివ స్టేజీపైకి వచ్చారు. వారితో బాలయ్య చేసిన సరదా సంభాషణ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది.
10 వేల స్క్రీన్స్‌లో విడుదల
‘కంగువ’ చిత్రం (Unstoppable Season 4) గురించి నిర్మాత ధనుంజయ్ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఇక ‘కంగవా’ విషయానికి వస్తే, డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్, యంగ్ స్టార్ దిశా పటానీ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సాలిడ్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో సూర్య రెండు విభిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం