రామ్ చరణ్ తన భార్య ఉపాసన, స్నేహితులతో పాటు కలిసి RRR బెనిఫిట్ షో థియేటర్‌లో వీక్షించారు. సినిమా చూస్తున్న సమయంలో ఆమె చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించిందది. రామ్ చరణ్ ఎంట్రీ, నాటు నాటు పాట సమయంలో అరుపులు కేకలతో పేపర్లు విసురుతూ రచ్చ చేసింది. సినిమా చూడటం పూర్తయిన తర్వాత ఎలా ఉందని మీడియా వాళ్లు అడిగినప్పుడు చాలా బాగుందని చెప్పింది. ఏం నచ్చిందని అడిగితే RRR ఫ్యామిలీ మొత్తం బాగుందని తెలిపింది.
RRR గత నాలుగేళ్లుగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. 2018లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి సినిమా ప్రకటించినప్పటినుంచి దీనిపై ఒక రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి. కరోనా అడ్డంకులతో చాలా గ్యాప్ తర్వాత మూవీ విడుదల కావడంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పండగలా ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్‌టీఆర్ కొమరం భీం పాత్రలో నటించారు. రామ్ చరణ్ బ్రిటీష్ అధికారుల వద్ద పనిచేసే పోలీస్ అధికారిగా కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం