రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు గత కొన్ని ఏళ్లుగా కలిసి రావడం లేదు. ఆయన గత మూడు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు. అయితే ఈ హీరో కొత్తగా ప్రకటిస్తున్న ప్రాజెక్ట్స్ మాత్రం అతడి ఫ్యూచర్ మూవీస్‌పై ఎంతో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల విజయ్ ఓ పిరియాడికల్ మూవీలో నటిస్తున్న ప్రకటించాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రంలో పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపించనున్నాడు. ఇక లేటెస్ట్‌గా వచ్చిన అప్‌డేట్ ప్రకారం స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో రౌడీ బాయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
‘విజయ్ – సుకుమార్ మూవీ పక్కా..’
విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నట్లు నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన ‘గం గం గణేశా’ చిత్రానికి కేదార్ నిర్మాతగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని నిర్మాత స్పష్టం చేశారు. ఇది విన్న విజయ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Sukumar : Vijay Deverakonda’s film will be there.
— RatpacCheck (@RatpacCheck) May 20, 2024
I thought this year RamCharan and Sukumar film might be in progress but didn’t happen, Pushpa2 is in progress. Currently, our project [ VD, Sukumar ] will take more time to go on floors, Sukumar Garu after completing his current… pic.twitter.com/2yNpn4tyhG
గతంలోనే ప్రకటన
విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో కొద్ది సంవత్సరాల క్రితమే ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటన వెలువడింది. నిర్మాత కేదార్ సెలగంశెట్టి నేతృత్వంలోని ఫాల్కన్ నిర్మాణ సంస్థ వీరి కాంబోలో సినిమా తీసేందుకు అప్పట్లో ప్రయత్నించింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ‘పుష్ప 2’ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని భావించినా సుకుమార్.. రామ్‌చరణ్ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించడంతో ఇక విజయ్‌తో సినిమా లేనట్లేనని సినీ వర్గాలు భావించాయి. అయితే లేటెస్ట్‌గా విజయ్-సుకుమార్ సినిమా ఉంటుందని నిర్మాత ప్రకటించడం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది.
2026 తర్వాతే..!
ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్.. ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ విడుదల తేదీ (ఆగస్టు 15) దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే రామ్‌చరణ్‌తో సినిమా మెుదలవుతుంది. చరణ్‌తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత విజయ్‌తో సుకుమార్ సినిమా చేయనున్నట్లు నిర్మాత కేదార్ సెలగంశెట్టి తెలిపారు. దీని ప్రకారం విజయ్ – సుకుమార్ మూవీ పట్టాలెక్కడానికి ఎట్టలేదన్న 2026 వరకూ ఆగాల్సిందేనని టాక్ వినిపిస్తోంది. పైగా పుష్ప 3 కూడా ఉండొచ్చని గతంలో బన్నీ ప్రకటించిన నేపథ్యంలో విజయ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ఫిల్మ్‌ను ‘జెర్సీ’ (Jersey) దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు విజయ్ ఓకే చెప్పాడు. ‘టాక్సీవాలా’ (Taxiwaala) ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్‌తో కలిసి విజయ్ ఓ పిరియాడికల్ మూవీ చేయబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా పోస్టర్ రిలీజ్ కాగా అది అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే దిల్‌రాజు నిర్మాతగా రవి కిరణ్ కోలాతో కలిసి ఓ యాక్షన్ డ్రామా సైతం విజయ్ చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత సుకుమార్‌తో విజయ్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!