• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIVO Y78 5G: వివో నుంచి  సరికొత్త ఫీచర్‌ రిచ్‌ స్మార్ట్‌ఫోన్… ఇండియాలో తక్కువ ధరకే..!

    మెుబైల్‌ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్‌ మార్కెట్‌లోకి రానుంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఇప్పటికే రిలీజ్‌ అయిన Y78  ఇండియాలో మేలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో టాప్ సెల్లింగ్ ఫోన్లు ఉన్నాయి. ఈ బ్రాండ్‌ నుంచి ఇప్పటికే చాలా మోడల్స్‌ టాప్‌లో నిలిచాయి. Y78లో ఉన్న ఫీచర్స్ ఏంటి? ధర ఎంత ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. 

    VIVO Y78

    వివో Y78 ఫోన్‌ను ఏప్రిల్‌ 24న లాంఛ్ చేశారు. వివిధ దేశాల్లో 26వ తేదీ నుంచి సేల్ ప్రారంభమయ్యింది. భారత్‌లో మాత్రం వచ్చే నెల అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వివో ఫోన్లకు ఆదరణ ఉంది కనుక కొత్త ఫోన్ కొనాలనుకుంటే ది కూడా లైన్‌లో పెట్టుకోవచ్చు. 

    డిస్‌ప్లే

    ఈ ఫోన్‌ 6.78 అంగులాలు ఉంటుంది. అమోల్డ్‌ డిస్‌ప్లే అందిస్తున్నారు. 1080 x 2400 పిక్సెల్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. 

    ప్రాసెసర్‌

    స్నాప్ డ్రాగన్ 695 5జీ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ 13, ORIGIN OS3 సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. 

    మెమోరీ

    వివో Y78 మూడు రకాల స్టోరేజీలతో వస్తోంది. 128GB + 8GB, 256GB + 8GB , 256 + 12GB RAM వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. 

    కెమెరా

    ఫోన్‌కి వెనకాల రెండు కెమెరాలు ఉంటాయి. ఒకటి 50MP వైడ్‌ కెమెరాతో పాటు 2 MP డెప్త్‌ కెమెరా ఇస్తున్నారు. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ రెండింటితో1080P క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేయవచ్చు.

    బ్యాటరీ

    Y78లో 5000mAh బ్యాటరీ సౌకర్యం ఉంది.  ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 44W ఛార్జర్‌ను ఇస్తున్నారు. 

    మరికొన్ని

    మూడు రంగుల్లో ఫోన్‌ను రూపొందించారు. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్‌లో తీసుకువచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది. 

    ధర

    వివో Y78 128GB + 8GB RAM ఫోన్‌ సుమారు రూ. 24, 990గా ఉంటుందని అంచనా. ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర ఫోన్లకు గట్టి పోటీని ఇచ్చేలా ధర ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv