వీకెండ్ అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే వీకెండ్ కోసం మూవీ లవర్స్ వీక్ ప్రారంభం నుంచే ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ వారం కూడా పలు కొత్త చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటి ప్లాట్ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
భారతీయుడు 2 (Indian 2)
కమల్ హాసన్ (Kamal Hassan), శంకర్ (Director Shankar) కాంబోలో రూపొందిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. తమిళం, తెలుగు, మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. జులై 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా పలు విమర్శలను సైతం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకులను ‘భారతీయుడు 2’ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ప్లాట్ ఏంటంటే ‘దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్‌తో సోషల్ మీడియాలో పోరాటం చేస్తాడు. సేనాపతి తిరిగి రావాలని హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తాడు. దీంతో ఇన్నేళ్ల తర్వాత సేనాపతి మళ్లీ ఇండియాకు వస్తాడు. అలా వచ్చిన సేనాపతి అవినీతి, లంచగొండితనంపై ఎలాంటి పోరాటం చేశాడు? అన్నది కథ.
ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా (Phir Aayi Hasseen Dillruba)
తాప్సీ పన్ను, విక్రాంత్, మాస్సే, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా‘ చిత్రం ఈ వారమే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో తాప్సీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ కానుంది. ప్లాట్ ఏంటంటే ‘రాణి కశ్యప్ (తాప్సీ), రిషు (విక్రాంత్) దంపతులు. ఇద్దరికి భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. రిషు మెతక కావడంతో నీల్ అనే వ్యక్తి పట్ల రాణి ఆకర్షితురాలవుతుంది. ఓ రోజు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి రిషు చనిపోతాడు. రాణినే ప్రియుడితో కలిసి చంపిందన్న ఆరోపణలు వస్తాయి. కేసు విచారణలో తేలిన నిజాలేంటి?’ అన్నది స్టోరీ.
టర్బో (Turbo)
మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ‘టర్బో’ (Turbo). విశాఖ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్లాట్ ఏంటంటే ‘ టర్బో జోస్ (మమ్ముట్టి) ఓ జీప్ డ్రైవర్. స్నేహితుడు జెర్రీ ప్రేమను గెలిపించే క్రమంలో ఓ యువతిని ఎత్తుకొస్తాడు. పోలీసులు కేసు పెట్టడంతో చెన్నైకి పారిపోతాడు. కట్ చేస్తే జెర్రీని ఓ గ్యాంగ్‌స్టర్ మనుషులు హత్య చేస్తారు. అతడి ప్రేయసిని చంపేందుకు యత్నిస్తారు. ఆమెను జోస్ ఎలా కాపాడాడు? జెర్రీని ఆ గ్యాంగ్ ఎందుకు చంపింది? స్నేహితుడి చావుకు జోస్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు?’ అన్నది స్టోరీ.
బర్త్ మార్క్ (Birthmark)
విక్రమ్ శ్రీధరన్ దర్శకత్వంలో షబీర్, మిర్మా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన థ్లిల్లర్ చిత్రం ‘బర్త్ మార్క్‘. ఆగస్టు 8 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. సీతారామంతో అందరి మనసులు దోచుకున్న విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆక్షణగా నిలిచింది. ప్లాట్ ఏంటంటే ‘లెఫ్టినెంట్ కమాండర్ డానియెల్ బోర్డర్లో శత్రుదేశానికి పట్టుబడి 6 నెలల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికే అతడి భార్య ప్రెగ్నెంట్. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటుంది. దీంతో నార్మల్ డెలివరీ కోసం వసతులు లేని గ్రామానికి భార్యను తీసుకెళ్తాడు. ఆమెకు డెలివరి ఎలా జరిగింది? ఆమె బిడ్డకు ఎవరి నుంచి ముప్పు పొంచి ఉంది? అన్నది స్టోరీ.
డెరిక్ అబ్రహం (Derick Abraham)
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం కూడా ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. మమ్ముట్టి హీరోగా షాజీ పాడూర్ దర్శకత్వంలో తెరెకెక్కిన ‘డెరిక్ అబ్రహం’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమై విజయాన్ని సొంతం చేసుకుంది. ఆగస్టు 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. సుమారు రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్లు వసూలు చేసింది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యల కేసును ఏఎస్పీ డెరిక్ అబ్రహాం (మమ్ముట్టి) ఎలా ఛేదించాడు? అన్నది ఈ చిత్ర కథాంశం.
గ్యారా గ్యారా (Gyaarah Gyaarah)
ఈ వారం ఒక ఇంట్రస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మీ ముందుకు రాబోతోంది. ‘కిల్’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ నటించిన ‘గ్యారా గ్యారా’ ఈ సిరీస్ స్టీమింగ్కు సిద్ధమైంది. ఆగస్టు 9 నుంచి జీ5 వేదికగా ప్రసారం కానుంది. ఈ సిరీస్ మూడు డిఫరెంట్ టైమ్ లైన్ల చుట్టూ నడుస్తూ ఉంటుంది. ‘రాఘవ్ జుయెల్, కృతిక సర్మ, ధైర్య కర్వా పోలీస్ ఆఫీసర్లుగా పని చేస్తుంటారు. చాలా ఏళ్లుగా మిస్టరీగానే ఉన్న ఓ మర్డర్ కేసు విచారణను చేపడతారు. ఈ క్రమంలో ఓ బాలిక మృతదేహం లభ్యమవుతుంది. వాకీ టాకీల ద్వారా ఒక కాలం నుంచి మరో కాలానికి ఈ ముగ్గురు మాట్లాడుతుంటారు. ఈ కేసుల మిస్టరీని వారు ఛేదిస్తారా? నిజాలను బయటికి తెస్తారా? అనేది ఈ సిరీస్‌లో చూడాలి.
కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ (Kingdom of the Planet of the Apes)
ఈ వీకెండ్లో మంచి హాలీవుడ్ చిత్రాన్ని చూడాలనుకునే వారికి ‘కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్’ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ మూవీ గతవారమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికీ చూడకపోతే ఈ వీకెండ్లో చూసేయండి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 2 నుంచి ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘ఏప్స్‌ను పాలిస్తున్న ప్రాక్సిమస్ సీజర్.. మనుషులను అంతం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో నోవా అనే యువతిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సీజర్ సంతతికి చెందిన చింపాజీ వచ్చి అడ్డుకుంటుంది. ఈ చర్యతో ఆగ్రహించిన ప్రాక్సిమస్ సీజర్.. నోవా, చింపాజీతో ఎలాంటి పోరాటం చేసింది? ప్రాక్సిమస్‌ను వారు కలిసికట్టుగా ఎలా ఎదుర్కొన్నారు? అన్నది కథ.
బృందా (Brinda)
గతం వారం ‘బృంద’ వెబ్‌సిరీస్‌లో ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. మీరు ఈ సిరీస్‌ను మిస్ అయ్యుంటే వీకెండ్‌కు తప్పకుండా ప్లాన్ చేసుకోండి. స్టార్ హీరోయిన్ త్రిష కెరీర్లో తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ఇది. ఆగస్టు 2 నుంచి సోనీ లీవ్‌లో తెలుగుతో పాటు వివిధ దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘బృంద ఓ పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా చేరిన ఎస్సై. ఓ రోజు స్థానిక చెరువులో శవం బయటపడుతుంది. హంతకుడు దానికి గుండు కొట్టి, గుండెల్లో 16 సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టంలో తేలుతుంది. ఆ తరహాలో మొత్తం 16 మంది అతి దారుణంగా హత్యకు గురైనట్లు బృంద కనిపెడుతుంది. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అతడ్ని బృందా టీమ్ ఎలా పట్టుకుంది?’ అన్నది స్టోరీ.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్