• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 68th Filmfare Awards South 2023: బెస్ట్‌ యాక్టర్స్‌గా రామ్‌చరణ్‌, తారక్‌.. ఆ చిత్రాలకు అవార్డుల పంట!

    దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR) కథానాయకులుగా చేసిన ఈ మూవీ గ్లోబల్‌ స్థాయిలో సత్తా చాటింది. పలు అంతర్జాతీయ అవార్జులను కొల్లగొట్టింది. అంతేకాదు పలు విభాగాల్లో ఆస్కార్‌ బరిలో నిలిచి ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇదిలా ఉంటే గతేడాదికి గాను తాజాగా ప్రకటించిన ‘ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ 2023’ (68 Filmfare Awards south 2023) అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరోమారు సత్తా చాటింది. ఏకంగా ఏడు అవార్డులు కైవసం చేసుకొని అందరి ప్రశంసలు అందుకుంటోంది. అటు సీతారామం, విరాటపర్వం, భీమ్లా నాయక్‌ మూవీలకు సైతం అవార్డులు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  

    ఫిల్మ్‌ఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్క్‌

    68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) 2022, 2023 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో 2022 మార్చి 24న విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ సినిమా (ఆర్‌ఆర్‌ఆర్‌), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ నటుడు (రామ్‌చరణ్‌, తారక్‌), ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌, ఉత్తమ కొరియోగ్రాఫర్‌ (ప్రేమ్‌ రక్షిత్‌), ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ (సాబు సిరిల్‌), ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (‘కొమురం భూముడో’ సాంగ్‌ పాడిన కాలభైరవ) విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. 

    ‘సీతారామం’కు అవార్డుల పంట

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత టాలీవుడ్‌ నుంచి ‘సీతారామం’ సత్తా చాటింది. వాస్తవానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘సీతారామం’ మధ్యనే గట్టి పోటీ నడిచింది. రాజమౌళి మేనియాను తట్టుకొని సైతం ‘సీతారామం’ నిలబడగలిగింది. ఎక్కువ విభాగాల్లో అవార్డులను కైవసం  చేసుకుంది. మెుత్తం ఐదు పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ మూవీ (క్రిటిక్స్), ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ నటి (మృణాల్ ఠాకుర్), ఉత్తమ లిరిక్స్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డులు వరించాయి. అలాగే రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాటపర్వం’ రెండు అవార్డులు, పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘భీమ్లా నాయక్‌’కు ఓ అవార్డు లభించింది. మరి ఏఏ విభాగాల్లో ఎవరెవరికి ఈ అవార్డులు దక్కాయో ఒకసారి పరిశీలిద్దాం.  

    ఆర్‌ఆర్‌ఆర్‌ అవార్డ్స్‌

    • ఉత్తమ సినిమా – ఆర్ఆర్ఆర్
    • ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)
    • ఉత్తమ నటుడు – రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
    • ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – కీరవాణి (ఆర్ఆర్ఆర్)
    • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)
    • ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ – నాటు నాటు పాట)
    • ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మేల్‌) – కాల భైరవ (కొమురం భీముడో పాటకు)

    సీతారామం అవార్డ్స్‌

    • ఉత్తమ మూవీ (క్రిటిక్స్) – సీతారామం (హను రాఘవపూడి)
    • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – దుల్కర్ సల్మాన్  (సీతారామం)
    • ఉత్తమ నటి – మృణాల్ ఠాకుర్ (సీతారామం)
    • ఉత్తమ లిరిక్స్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి – కానున్న కల్యాణం (సీతారామం)
    • ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్‌) – చిన్మయి శ్రీపాద (సీతారామం – ఓ ప్రేమ..)

    ఇతర చిత్రాలు

    • ఉత్తమ నటి (క్రిటిక్స్) – సాయిపల్లవి (విరాటపర్వం)
    • ఉత్తమ సహాయ నటి – నందితా దాస్ (విరాటపర్వం)
    • ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv