• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండియాలో ఉపయోగించే టాప్‌-10 యాప్స్‌

    మాటా,ముచ్చట, షాపింగ్‌, వినోదం, ఆటలు, పాటలు, గొడవలు, కొట్లాటలు….స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక అంతా ఆన్‌లైన్‌లోనే అన్నట్టుగా తయారైంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో 26 లక్షలకు పైగా యాప్స్‌ ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే అన్ని యాప్స్‌ ఉన్నా… కొన్ని మాత్రం ప్రతి ఒక్కరి ఫోన్‌లో తప్పక ఉండాల్సిందే. అవి లేనిదే దైనందిన జీవితం కూడా గడవదు అంటే అతిశయోక్తి కాదు. ఇండియాలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న 10 యాప్స్‌ ఏవో ఇక్కడ చూద్దాం.

    వాట్సాప్‌

    ఇది అందరికీ తెలిసిందే. మరో మాట లేకుండా వాట్సాప్‌ కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. పొద్దున లేచి నిద్రమత్తులోనే ఫోన్‌ను వెతికి ముందుగా ఓపెన్‌ చేసేది వాట్సాప్‌నే. గుడ్‌మార్నింగ్‌ దగ్గర్నుంచి గుడ్‌ నైట్‌ వరకు మన ఫోన్‌లో ఎక్కువ సమయం ఉపయోగించే యాప్‌ వాట్సాప్‌. 48 కోట్ల 70 లక్షలకు పైగా యాక్టివ్‌ యూజర్స్‌తో ఇండియాలో వాట్సాప్‌ టాప్‌లో ఉంది. 

    యూట్యూబ్‌

    ఒకప్పుడు వినోదం అంటే టీవీ, థియేటర్‌. యూట్యూబ్‌ ఆ పంథానే మార్చేసింది. స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక. ఇంట్లో కూర్చుని వంటలు చేసుకునే వారికైనా…అదే ఇంట్లో కూర్చుని IAS ప్రిపేర్‌ అయ్యే వారికైనా దొరకని వీడియో అంటూ యూట్యూబ్‌లో ఉండదు. సుమారు 50 కోట్ల యాక్టివ్‌ యూజర్స్‌తో యూట్యూబ్‌ ఇండియాలో టాప్‌ యాప్‌గా కొనసాగుతోంది.

    ఫేస్‌బుక్‌

    ఇప్పుడంటే సోషల్‌ మీడియా యాప్స్‌ చాలానే పుట్టుకొచ్చాయి గానీ అసలు సోషల్‌ మీడియాను అందరికీ పరిచయం చేసింది  ఫేస్‌బుక్‌ అనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఫేస్‌బుక్‌ను వినియోగించే టాప్‌ 3 దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా ఉంది. 31 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌తో ఫేస్‌బుక్‌ ఇండియాలో హవా కొనసాగిస్తోంది.

    ఇన్‌స్టాగ్రాం

    90s కిడ్స్‌కి ఫేస్‌బుక్‌ ఎలాగో 2K కిడ్స్‌కు ఇన్‌స్టా అలాంటిది. మీమ్‌ కల్చర్‌ వచ్చాక ఇన్‌స్టాగ్రాం ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. సెలబ్రిటీల నుంచి 6th క్లాస్‌ కిడ్స్‌ వరకూ ప్రతి ఒక్కరూ వాడే యాప్‌ ఇన్‌స్టాగ్రాం. ఇండియాలో సుమారు 30 కోట్ల మంథ్లీ యాక్టివ్‌ యూజర్స్‌తో ప్రపంచంలోనే ఇన్‌స్టా వాడుతున్న వారిలో ఇండియా తొలి స్థానంలో ఉంది.

    ట్రూ కాలర్‌

    స్పామ్ కాల్స్‌ను పసిగట్టి ఆపేయాలన్నా, మనకు తెలియని నంబర్‌ వస్తే ముందుగానే వారి పేరు చూడాలన్నా, కాల్‌ రికార్డ్ చేస్తున్నపుడు అవతలివారికి ఆ విషయం తెలియకుండా రికార్డు చేయాలన్నా చక్కటి యాప్‌ ట్రూ కాలర్‌. చాలా మంది ఫోన్లలో ఇప్పుడిదే డిఫాల్ట్‌ డయలర్‌గా ఉంది.ఈ యాప్‌నకు ప్రస్తుతం ఇండియాలో 33 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్‌ యూజర్స్‌ ఉన్నారు.

    గూగుల్‌ పే

    భారత్‌  డిజిటల్‌ పేమెంట్స్‌ దిశగా అడుగులు వేస్తున్న తొలినాళ్లలో గూగుల్‌పే ఒక సంచలనం. సులభమైన ఇంటర్‌ఫేస్‌తో అందరూ ఈజీగా పేమెంట్స్‌ చేసే యూపీఐ యాప్‌గా గూగుల్‌ పే( అప్పట్లో Tez) వచ్చింది. దీనికి తోడు స్క్రాచ్‌ కార్డుల పేరుతో అప్పట్లో ప్రతి ట్రాన్సాక్షన్‌కు రివార్డు ఇచ్చేది. ఇప్పుడు రివార్డులు అంత ప్రయోజనకరంగా లేకపోయినా దాదాపుగా 34 శాతం UPI పేమెంట్స్‌తో కొనసాగుతోంది 

    ఫోన్‌ పే

    గూగుల్ పే బాటలోనే తర్వాత వచ్చిన యాప్‌ ఫోన్‌ పే కానీ ప్రస్తుతం ఇండియాలో జరిగే యూపీఐ పేమెంట్స్‌లో  46 శాతానికి పైగా ఫోన్‌పై ద్వారానే సాగుతున్నాయి. జీపేను సైతం దాటేసి ఇప్పుడు ఇది ముందంజలో ఉంది.

    మెసెంజర్‌

    ఫేస్‌బుక్‌కు చెందిన చాటింగ్‌ యాప్‌ ఇది. సుమారు 11 కోట్ల యాక్టివ్‌ యూజర్స్‌తో కొనసాగుతోంది. ఇన్‌స్టా వచ్చాక ఫేస్‌బుక్‌కు యూజర్లు తగ్గుతూ వచ్చారు.

    స్నాప్‌చాట్‌

    ఇప్పుడిప్పుడే ఇండియాలో మెల్లగా పైకి వెళ్తున్న మరో సోషల్ యాప్‌. ఫోటోలు తీసుకునే సౌలభ్యం, అనేక ఫిల్టర్లు, ఎప్పటికప్పుడు స్నాప్స్‌ పేరిట అప్డేట్స్‌ ఇలా యూత్‌ను ఆకట్టుకునే చాలా ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. 15 కోట్లకు పైగా యాక్టివ్‌ యూజర్స్‌ ఉన్నారు.

    గూగుల్ యాప్స్‌

    ఇక ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్ డీఫాల్ట్‌గా ఇచ్చే యాప్స్‌ కూడా టాప్‌ 10లో ఉన్నాయి. గూగుల్‌ కాల్‌, మెసేజ్‌, జీమెయిల్‌, క్రోమ్‌, గూగుల్‌ సెర్చ్‌, కాంటాక్స్‌ ఈ యాప్స్‌ అన్నీ వినియోగంలో టాప్‌లోనే ఉంటాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv