• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Raksha Bandhan 2024: తోబుట్టువులతో రాఖీ కట్టించుకున్న సెలబ్రిటీలు.. ఓ లుక్కేయండి!

    అన్నను కొండంత అండగా స్త్రీలు భావిస్తుంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమను, వారి యోగ క్షేమాలను చూసుకునేది కూడా అన్న లేదా తమ్ముడు మాత్రమే. కష్టసుఖాల్లో పాలుపంచుకునే తొలి మిత్రుడిగా సోదరుడ్ని చెబుతుంటారు. అన్న-చెల్లెళ్లు, అక్క-తమ్ముడి మధ్య ఉండే అప్యాయతలకు ప్రతీకగా ప్రతీ ఏటా రాఖీ పండగను జరుపుకుంటారు. ఒకరికొకరు అండగా ఉంటామని ఈ పండగ ద్వారా చాటి చెప్పుకుంటారు. అటు సెలబ్రిటీలు సైతం రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం (ఆగస్టు 19) సందర్భంగా సెలబ్రిటీలు తమ సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో సైతం పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    మెగా డాటర్స్‌ సుస్మిత కొణిదెల, నిహారిక కొణిదెల యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌కు రాఖీ కట్టారు.

    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు కూడా మెగా డాటర్‌ నిహారిక కొణిదెల రాఖీ కట్టి అతడి ఆశీస్సులు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను చరణ్‌ స్వయంగా పంచుకున్నారు. 

    యువ నటుడు సుధీర్‌ బాబు కూడా తన సోదరితో కలిసి రాఖీ వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. తన అక్కతో సెల్ఫీ దిగి తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 

    నటుడు సందీప్‌ కిషన్‌ సైతం సోదరి మౌనికతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. చెల్లెలితో చిన్నప్పుడు దిగిన ఫొటోను పంచుకున్నారు. 

    బాలీవుడ్‌ నటి పరిణితి చోప్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సోదరులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపింది. వారితో వీడియోకాల్‌లో మాట్లాడిన ఫొటోను షేర్ చేసింది. 

    స్టార్‌ నటి రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ తన తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

    ప్రముఖ నటి జెనీలియా, సోదరుడు నిగెల్‌ డిసౌజాకు రాఖీ పర్వదినంగా సందర్భంగా విష్‌ చేశారు. అవసరం వచ్చిన ప్రతీ చోట అతడు అండగా నిలిచాడంటూ కొనియాడారు. 

    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. చెల్లెళ్లు ప్రసీద, ప్రదీప్తి ప్రభాస్‌కు రాఖీ కట్టి శుభాంకాక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి రక్షాబంధన్‌ సందర్భంగా సోదరులతో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. అలాగే బన్నీ కూతురు అల్లు అర్హా తన సోదరుడు అయాన్‌కు రాఖీ కడుతున్న ఫొటోలను కూడా పంచుకుంది. అల్లు అర్హ ఓ బేబీ డాగ్‌కు కూడా రాఖీ కట్టడం ఫొటోల్లో చూడవచ్చు.

    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇంట్లో రాఖీ వేడుకలు జరిగాయి. మహేష్‌ బాబు కూతురు సితార తన అన్న గౌతమ్‌కు రాఖీ కట్టి విషెస్‌ తెలియజేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv