• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara Record: రాజమౌళి, ప్రభాస్‌కు షాకిచ్చిన తారక్‌.. తెలుగు సినీ చరిత్రలో ఏకైక చిత్రంగా ‘దేవర’! 

    జూ. ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా రిలీజై 18 రోజులు అయినప్పటికీ దేవర జోరు ఏమాత్రం తగ్గలేదు. రిలీజైన అన్ని ఏరియాల్లో ఎప్పుడో బ్రేక్ ఈవెన్‌ సాధించిన ఈ చిత్రం, ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తొలిరోజు ‘దేవర’పై కాస్త నెగిటివ్‌ టాక్స్‌ వచ్చినా కలెక్షన్స్‌పై ఏమాత్రం ప్రభావం కనిపించలేదు. వసూళ్ల పరంగా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాదు గ్లోబల్‌ స్టార్‌గా వెలుగొందుతున్న ప్రభాస్‌కు సైతం సాధ్యం కానీ ఘనతను తారక్‌ అందుకున్నాడు. 

    తెలుగులో కొత్త చరిత్ర!

    తారక్‌ (Jr NTR), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) జంటగా నటించిన ‘దేవర’ చిత్రం వసూళ్ల పరంగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రిలీజైన 18 రోజుల్లో ఏపీ, తెలంగాణాల్లో రోజూ రూ.కోటీకి పైగా వసూళ్లు సాధించింది. పోస్టు కోవిడ్‌ తర్వాత రిలీజైన తెలుగు చిత్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా దేవర రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ ఘనత రాజమౌళి తెరకెక్కించిన  ‘RRR’ పేరిట ఉండేది. ఆ చిత్రం వరుసగా 17 రోజులు తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటికి పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ దెబ్బకు ఆ రికార్డు గల్లంతైంది. అటు కరోనా తర్వాత వచ్చిన ప్రభాస్‌ చిత్రాలు (రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, సలార్‌, కల్కి 2898 ఏడీ) సైతం ఈ ఫీట్‌ను సాధించలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే తారక్‌ స్టామినా ఏంటో అర్థమవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

    దేవర కలెక్షన్స్‌ ఎంతంటే?

    ‘దేవర’ చిత్రం తొలి 16 రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా రూ.509 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ఇటీవల మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. గత రెండ్రోజుల కలెక్షన్స్‌ జత చేస్తే రూ.520 కోట్లు టచ్‌ చేసే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ. 222.60 కోట్లు (GROSS) ఖాతాలోకి వచ్చి చేరినట్లు పేర్కొన్నాయి. కర్ణాటకలో రూ.17.70  కోట్లు, తమిళనాడు రూ. 4.13 కోట్లు, కేరళ రూ. 97 లక్షలు, హిందీ + రెస్ట్‌ ఆఫ్ ఇండియా రూ. 33.55 కోట్లు వసూలైనట్లు వివరించాయి. ఈ వసూళ్ల పరంపర ఇలాగే కొనసాగితే ఈజీగానే రూ.550 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి లాంగ్‌ రన్‌లో ఈ ఫీట్‌ సాధిస్తుందో లేదో చూడాలి.

    స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్సయ్యిందా?

    దేవర డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు దక్కించుకుంది. ఈ సినిమా రిలీజై 18 రోజులు గడిచిపోయిన నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడూ వస్తుందా అన్న ఎదురుచూపులు అందరిలోనూ మెుదలయ్యాయి. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘దేవర’ను దీపావళి కానుకగా ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్‌ ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దీపావళికి సాధ్యం కాకపోతే నవంబర్‌ రెండో వారంలోనైనా కచ్చితంగా స్ట్రీమింగ్‌కు తెచ్చే అవకాశముంది. అటు దేవర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.150 కోట్లకు దక్కించుకుంది. మూవీ రిలీజ్‌ అయిన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం చేసుకుంది. 

    ‘NTR 31’ లోడింగ్‌!

    ‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr NTR), ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్‌ నీల్‌ ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్‌ పార్ట్‌గా తీసుకురావాలని నిర్ణయించారట. అంతేకాదు ఇందులో బంగ్లాదేశ్‌ రైతుగా తారక్‌ కనిపిస్తారని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. కథ మెుత్తం బంగ్లాదేశ్‌ నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హీరోయిన్‌ను కూడా ఈ మూవీ కోసం లాక్‌ చేశారని తెలుస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ ఇందులో తారక్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో ‘అప్పుడో ఇప్పుడో’ అనే సినిమా చేస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv