టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజాది గ్రేట్’ వంటి బ్లాక్‌బాస్టర్ తీసిన రవితేజ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఇటీవల ధమకా, ఈగల్ చిత్రాలతో పర్వాలేదనిపించినా రవితేజ స్థాయికి తగ్గ సక్సెస్ మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్‌గా మిస్టర్. బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్ వెంటాడుతుండటంతో ఈ మాస్ మహారాజ్ డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
‘ఆవేశం’ రీమేక్‌లో రవితేజ!
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ రూపొందించిన చిత్రం ‘ఆవేశం’ (Aavesham). యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆవేశం ఈ ఏడాదే రిలీజై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ స్వయంగా ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడంతో ఆయనే ఇందులో నటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రవితేజ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రావొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
బాలయ్యను కాదని..
‘ఆవేశం’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగులోకి రీమేక్ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్ పోషించిన పాత్ర బాలయ్యకు బాగా సెట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ‘ఆవేశం’ చిత్రాన్ని బాలయ్య ఖాతాలోనే వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్యను కాదని మాస్ మాహారాజా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నారు. తద్వారా బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టారు. అయితే రవితేజకు కూడా ఫహాద్ ఫాజిల్ పాత్ర సెట్ అవుతుందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఆ పాత్రలోని డిఫరెంట్ షేడ్స్‌ను రవితేజ (Ravi Teja) చక్కగా పలికిస్తారని అంటున్నారు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.
ఫ్లాప్స్ బెడద తట్టుకోలేకనే!
ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌తో పూర్తిగా డీలా పడ్డారు. ఆయన చేసిన గత పది చిత్రాల్లో కేవలం ఒకే ఒక్క చిత్రం (క్రాక్) సూపర్ హిట్‌గా నిలిచింది. మరో రెండు చిత్రాలు (ధమకా, ఈగల్) యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మిగిలిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. రీసెంట్‌గా వచ్చి ‘మిస్టర్ బచ్చన్’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్‌తో రవితేజపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదని, కథ కంటే తనలో సగం ఏజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఘాటు రొమాన్స్ చేయడానికే రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆలోచనలో పడ్డ రవితేజ ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేఫ్ జోన్‌గా మలయాళం మంచి విజయం సాధించిన ‘ఆవేశం’ను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు సమాచారం.
మరి ‘ఆవేశం’ సెట్ అవుతుందా?
‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్ అయిన రంగా (ఫహద్ ఫాజిల్)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్ ఈ కథలో స్పెషల్ ఎట్రాక్షన్. తెలుగులో ఆ క్యారెక్టర్ సీనియర్ నటులు ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే మెుదటి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ (Ravi Teja) పేరు తెరపైకి రావడంతో అతడికి ఎలా ఉంటుందన్న సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేకుండా రవితేజ చేయవచ్చు. ఎందుకంటే కామెడీ, యాక్షన్, అగ్రెషన్ ఇలా అన్ని షేడ్స్ రంగా పాత్రలో ఉన్నాయి. దీనికి రవితేజ పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు.