అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ఆకట్టుకొని తెలుగులో వరుస ప్రాజెక్ట్స్ చేసింది. రవితేజ, రామ్, బాలకృష్ణ, నితీన్, పంజా వైష్ణవ్ తేజ్, మహేష్ బాబు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ‘భగవంత్ కేసరి’ మినహా ఆమె నటించిన చిత్రాలన్నీ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ అమ్మడికి ఐరెన్ లెగ్ అన్న ముద్ర వేశారు. మహేష్ ‘గుంటూరు కారం’ తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా రాకపోవడంతో శ్రీలీల కెరీర్ ఇక ముగిసినట్లేనని అంతా భావించారు. అయితే ‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్‌తో ఈ అమ్మడు మరోమారు బౌన్స్ బ్యాక్ అయ్యింది. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది.
నాగచైతన్యకు జోడీగా..
నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు (Karthik Dandu) ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ‘NC24’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్, SVC క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా ఎంపికైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. తొలుత ఈ పాత్రకు మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary)ని అనుకున్నప్పటికీ శ్రీలీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. లుక్స్ టెస్ట్ కూడా ఆదివారం (డిసెంబర్ 15) జరిగిందని, మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. దీంతో తెరపై చైతూ-శ్రీలీల జోడీ తెరపై ఎలాంటి మాయ చేస్తుందోనని ఇప్పటి నుంచే అక్కినేని ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు.
కోలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ..
‘అమరన్’తో సాలిడ్ హిట్ అందుకున్న శివకార్తికేయన్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ‘SK25’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో నటుడు జయం రవి, అధర్వ కీలక పాత్రల పోషించనున్నారు. రూ.150 కోట్ల బడ్టెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్గా నటించనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించారు. తమిళంలో శ్రీలీలకు ఇదే మెుట్ట మెుదటి ఫిల్మ్. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రానికి ‘పురనానూరు’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఇది రానున్నట్లు సమాచారం.
చేతి నిండా ప్రాజెక్ట్స్..
నితీన్ లేటెస్ట్ చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robin Hood)లోనూ శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. అలాగే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) సినిమాలోనూ ఈ అమ్మడే హీరోయిన్. రవితేజ (Raviteja) హీరోగా నటిస్తోన్న ‘మాస్ జాతర‘ (Mass Jathara) చిత్రంలోనూ శ్రీలీలనే హీరోయిన్గా చేస్తోంది. ‘ధమాకా‘ (Dhamaka) తర్వాత వీరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇవి కాకుండా ప్రస్తుతం చర్చల దశలో మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అఖిల్ అక్కినేని (Akkineni Akhil) అప్‌కమింగ్ ఫిల్మ్‌లోనూ కథానాయికగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటించే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా రానున్న ‘కోహినూర్’ (Kohinur) చిత్రంలోనూ శ్రీలీల (Sreeleela) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని శ్రీలీల దూకుడు ప్రదర్శిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్