ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) పోటాపోటీగా సేల్స్ నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale)ను ప్రకటించింది. దీని కోసం తన వెబ్‌సైట్‌లో ప్రత్యేక పేజీనీ కూడా ఏర్పాటు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం స్పెషల్ పేజీని కూడా క్రియేట్ చేసింది. అయితే ఈ మెగా సేల్స్ ఏ ఏ తేదీల్లో జరగనున్నాయో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ స్పష్టం చేయలేదు.
సేల్ ప్రారంభం ఆ రోజే..!
ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సేల్‌పై స్పష్టత లేకపోయినప్పటికీ, అమెజాన్ మాత్రం ఈ సేల్‌పై స్పష్టత ఇచ్చింది. అక్టోబర్ 10న గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభమవుతుందని ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఒక రోజు ముందే ఈ సేల్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. అంటే అక్టోబర్ 9 నుంచే ప్రైమ్ యూజర్లు తమ కొనుగోళ్లను ప్రారంభించవచ్చు. అమెజాన్‌లో ఏ సేల్ జరిగినా ప్రైమ్ యూజర్లకు ఒక రోజు ముందే అందుబాటులోకి వస్తుందనే విషయం తెలిసిందే.
అమెజాన్ సేల్ డిస్కౌంట్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో.. SBI డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం వరకు డిస్కౌంట్ అందనుంది. అలాగే అమెజాన్ గిఫ్ట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ ద్వారా రూ.50,000 వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్ఛేంజీ ఆఫర్ ద్వారా రూ. 60,000 వరకు సేవ్ చేసుకునే వెసులుబాటు ఈ సేల్‌లో ఉంటుందని అమెజాన్ తన బ్యానర్ పేజీలో వెల్లడించింది. అమెజాన్ ఫ్రెష్ ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్, అమెజాన్ ఫార్మసీ ద్వారా మెడిసిన్ కొనుగోలు చేస్తే 35 శాతం వరకు రాయితీ ఈ సేల్‌లో ఉండనున్నాయి.
మొబైల్ డిస్కౌంట్స్
ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో.. ఇటీవల విడుదలైన ఐకూ జెడ్ 7 ప్రో (iQOO Z7 Pro), హానర్ 90 ప్రో 5 జీ (Honor 90 pro 5g) ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అలాగే రియల్మీ 60 5జీ Realme 60 5G), శాంసంగ్ ఎం34 (Samsung M34), వన్ ప్లస్ నార్డ్ సీఈ3 (Oneplus Nord CE3) ఫోన్లపై కూడా మంచి ఆఫర్స్ అందిస్తామని స్పష్టం చేసింది.
ఎలక్ట్రానిక్స్ సేల్స్
ఈ సేల్‌లో యాక్సెసరీస్ (Accessories)పై అమెజాన్ 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుందని తెలుస్తోంది. అలాగే ల్యాప్ టాప్‌లు (Laptops), హెడ్ ఫోన్స్ (Headphones), స్మార్ట్ టీవీ (Smart Tv) లపై డిస్కౌంట్ 75 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. బ్లాక్ బస్టర్ డీల్స్, డీల్స్ అండర్ 999, రూ.49 నుంచే కిచెన్ సామన్లు సహా ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో ఆఫర్లు ఉండనున్నట్లు సమాచారం. పలు కొత్త ఉత్పత్తులు కూడా ఈ సేల్ సందర్భంగా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది.
ప్రైమ్ సబ్స్క్రైబర్స్..
ఈ సేల్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లకు.. ఎర్లీ యాక్సెస్ (Early Access)తో పాటు తొలి రోజు ఫ్రీ డెలివరీ సదుపాయం ఉంటుంది. అలాగే మొదటిసారి అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసేవారికి వెల్కం రివార్డులను కూడా అమెజాన్ అందించనుంది.
త్వరలోనే స్పష్టట
గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఉండబోయే అన్ని ఆఫర్లు, సేల్స్ కచ్చితమైన తేదీలను అమెజాన్ త్వరలోనే రివీల్ చేయనుంది. అటు ఫ్లిప్ కార్ట్ కూడా త్వరలోనే సేల్ తేదీలను వెల్లడించే అవకాశముంది. ఈ రెండు సేల్స్ ద్వారా కస్టమర్లు తమకు ఇష్టమైన వస్తువులను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!