• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సైనికుడిని కాపాడేందుకు ఆర్మీ శునకం ప్రాణ త్యాగం

  ఉగ్రవాదుల దాడిలో సైనికుడిని రక్షించే క్రమంలో భారత ఆర్మీకి చెందిన కెంట్ అనే శునకం(6) ప్రాణాలు కోల్పోయింది. నిన్న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపడుతున్న బృందం.. కెంట్‌ను తీసుకువెళ్లింది. ఉగ్రమూకను పసిగట్టిన కెంట్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టేందు వస్తున్న క్రమంలో వారికి కెంట్ ఎదురెళ్లింది. దీంతో ఉగ్రవాదుల కాల్పుల్లో శునకం తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.

  https://x.com/ANI/status/1701784499481362778?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv