ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ హీరోయన్లతో సమానంగా గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాంటి అనసూయ తాజాగా తన లుక్‌ను పూర్తిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పటిలా హెయిర్‌ను వెనక్కి కాకుండా ముందుకు వదిలేసి బేబీ కటింగ్ స్టైల్లో మేకోవర్ అయ్యింది.
ఆ లుక్‌తోనే బ్యూటీఫుల్ శారీలో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రంగమ్మత్త మేకోవర్‌కు ఫిదా అవుతున్నారు.
అయితే రొటీన్‌గా ఒకే లుక్‌లో కనిపించి అనసూయ కాస్త బోర్ ఫీలై ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఛేంజ్ ఔట్ కోసం ఈ విధంగా రెడీ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు.
జబర్దస్త్ షో (Jabardasth Show) ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.
2012 – 2022 మధ్య బుల్లితెర యాంకర్‌గా కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.
యాంకర్ కాకముందు ప్రముఖ వార్త ఛానల్లో అనసూయ (Anasuya Bharadwaj) న్యూస్ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.
రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meeku Maathrame Cheptha), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.
సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది.
గతేడాది సెప్టెంబర్‌లో పెదకాపు1 (Pedda Kapu-1) అనే సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత విమానం (Vimanam) అనే మరో మూవీలోనూ అనసూయ నటించింది. ఇందులో తెలంగాణ మాండలికం ఓన్ చేసుకొని మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రీసెంట్గా ‘రజాకార్’ (Razakar) అనే తెలంగాణ నేపథ్యమున్న చిత్రంలోనూ అనసూయ మెరిసింది. ఇందులో పోచమ్మ పాత్రలో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించి ఆకట్టుకుంది.
అల్లుఅర్జున్ – సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ నటిస్తోంది.
గతంలో ‘పుష్ప’లో ఈ పాత్రనే ఆమె పోషించగా మంచి పేరు వచ్చింది. దీంతో పుష్ప 2లో తన రోల్‌పై అనసూయ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
పుష్ప 2తో పాటు తమిళంలో ‘ ఫ్లాష్‌బాక్’ (Flashback), ఉల్ఫ్ (Wolf) అనే రెండు చిత్రాల్లో అనసూయ నటిస్తోంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.