• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ

    టీడీపీ నేత నారా లోకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఢిల్లీలో ఉంటున్న లోకేశ్ ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి అమిత్ షాను కలవడంపై చర్చ జరుగుతోంది. తన తండ్రి అరెస్ట్, కోర్టుల్లో జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకు వివరించినట్లు లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

    ‘స్కంద’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

    ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘స్కంద’ మూవీ ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకుంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్కంద’ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుండగా.. దీనికి సీక్వెల్ తీస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.

    ఎన్నికల గుర్తులపై ఢిల్లీ హైకోర్టుకు బీఆర్ఎస్

    బీఆర్ఎస్ ఎన్నికల సింబల్ అయిన కారును పోలిన గుర్తును అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీకి కేటాయించొద్దంటూ ఆ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. కెమెరా, చపాతీ రోలర్, రోడ్డు రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమెషిన్, ఓడ, ఆటోరిక్షా వంటి కారును పోలిన గుర్తులను వచ్చే ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థులు, గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేటాయించొద్దని బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించనుంది.

    మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున?

    మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సతీమణి జమున బరిలోకి దిగుతుందనే చర్చ జరుగుతోంది. రాజేందర్ కుటుంబం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పూడూరులో నివాసం ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాల విషయంలోనూ వారి కుటుంబానికి మేడ్చల్‌తో మంచి సంబంధాలున్నాయి. ఇక్కడ టికెట్ కోసం పోటీపడుతున్న వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా కలిసి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

    విమానంలో మళయాళ నటికి వేధింపులు

    తనకు విమాన ప్రయాణంలో వేధింపులు ఎదురయ్యాయని మళయాళ నటి దివ్యప్రభ పోలీసులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నెల 10న ఎయిరిండియా విమానంలో ముంబయి నుంచి కొచ్చిన్‌ వస్తుండగా పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని, తనపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. సిబ్బందికి చెప్తే తనకు మరో సీటు కేటాయించారని.. అయితే దీనిపై ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిట్లు తెలిపింది.

    మూన్నెళ్ల చిన్నారికి 31 సర్టిఫికెట్లు

    మధ్యప్రదేశ్‌కు చెందిన మూడు నెలల చిన్నారి శరణ్య సూర్యవనికి 72 రోజుల వ్యవధిలో ఏకంగా 31 ధ్రువపత్రాలు వచ్చాయి. దీంతో ఆ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. గతంలో 28 సర్టిఫికెట్లతో ఓ చిన్నారి పేరు మీదున్న రికార్డ్‌ను అధిగమించాలనే పట్టుదలతో పాప తల్లిదండ్రులు ఈ రికార్డ్ సాధించారు. ఇందుకోసం శరణ్య పేరుతో ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్ సహా 31 సర్టిఫికెట్లను పొందారు.

    యూపీలో అమానుష ఘటన

    ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నగరంలో అమానుష ఘటన జరిగింది. అత్యాచారాన్ని ప్రతిఘటించిందనే కారణంతో కొందరు యువకులు 17 ఏళ్ల బాలికను రైలు కింద పడేశారు. దీంతో బాలిక రెండు కాళ్లు, ఒక చెయ్యి కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను కొందరు యువకులు వేధింపులకు గురిచేస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

    20 మంది అధికారులకు ఈసీ షాక్

    తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 20 మంది అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, అబ్కారీ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రవాణా శాఖ కార్యదర్శిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి ఎలాంటి విధులు అప్పగించొద్దని సీఎస్ శాంతికుమారిని ఆదేశించింది. కాగా, వీరిలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ ఉన్నారు.

    అన్‌స్టాపబుల్ సీజన్-3 డేట్స్ ఫిక్స్

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్-3 ఈనెల 17 నుంచి ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ‘బాలయ్య నటించిన భగవంత్ కేసరి’ మూవీ టీం సందడి చేయనుంది. డెరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు కాజల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్‌తో కూడిన ఫొటోలను విడుదల చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. బాలకృష్ణ మరోసారి ఈ ప్రోగ్రామ్‌లో సందడి చేయనుండటంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ 19న రిలీజ్ కానుంది.

    అద్భుతమైన పెయింటింగ్.. వీడియో వైరల్

    పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఓ చెట్టుపై వేసిన పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ చెట్టును కౌగిలించుకొని వృక్షాలను రక్షించాలనే సందేశం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రం పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింగర్ కుమార్ సాను ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. magnificent art meaningful drawing#5DaysToTiger3Trailer#InternationalDayOfGirlChild#INDvsAFG #RashmikaMandanna#PalestineUnderAttack#AnimalTheFilm #AamirKhan #AmitabhBachchanBirthday#HamasMassacre #Israel#GazaUnderAttackpic.twitter.com/37KW4LviYf — Singer Kumar Sanu (@KumarsanuTc) October 11, 2023