• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెగాస్టార్ ఫస్ట్ సింగిల్ ప్రోమో

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు సన్నాహాలు మెుదలయ్యాయి. రేపు పాటను విడుదల చేస్తుండగా..ఇందుకు సంబంధించిన చిన్న ప్రొమోను వదిలారు. బాస్ పార్టీ అంటూ సాగే ఈ పాట సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మార్క్ ట్యూన్ లో ఉంది. ప్రోమోలో మాత్రం చిరును పరిచయం చేసేలా తీశారు. అతిగా ఆశించిన ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశకు గురవుతారు. కానీ, చిరంజీవి స్టైల్, స్వాగ్ ఏ మాత్రం తగ్గకుండా పాటను చిత్రీకరించినట్లు కనిపిస్తోంది.

    భారత్‌లో టాప్-5 డేటింగ్ యాప్స్ ఇవే… పూర్తి సమీక్ష 

    ఈరోజుల్లో యువత సరికొత్త పరిచయాల కోసం ఆరాటపడుతోంది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లోనే ప్రేమించుకొని, పెళ్లి చేసుకునే రోజులు వచ్చాయి. ఇలాంటి సమయంలో యువత రిలేషన్ షిప్‌ను ఏర్పరుచుకునేందుకు డేటింగ్ యాప్స్ వైపు మెుగ్గు చూపుతోంది. కానీ, ఇటీవల  దిల్లీ లాంటి ఉదంతాలతో జంకుతోంది.  ఇండియాలో చాలా డేటింగ్  యాప్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. డేటింగ్ యాప్స్‌లో సాధారణ పరిచయాలైనా, ప్రేమ, స్నేహ బంధాలకైనా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో సరైన యాప్‌ను ఎంచుకోవటం ప్రస్తుతం సవాలుగా మారింది.  డేటింగ్ యాప్స్ రేటింగ్స్, ఉపయోగించే తీరు, … Read more

    పాక్ లో ఓ తరానికి నేను మ్యాచ్ ఫిక్సర్: వసీం అక్రమ్

    పాకిస్థాన్ లో ప్రస్తుత సామాజిక మాధ్యమాల తరం తనను ఇంకా మ్యాచ్ ఫిక్సర్ గానే చూస్తోందంటూ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ అన్నాడు. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి దేశాల్లో మంచి పేస్ బౌలర్ ప్రస్తావన వస్తే తన పేరు కచ్చితంగా ఉంటుందన్నాడు. కానీ, పాకిస్థాన్ లో మాత్రం ప్రతి కామెంట్ లో తనను [మ్యాచ్ ఫిక్సర్](url) అని అంటారనే పేర్కొన్నాడు.1996 లో న్యూజిలాండ్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ పై అక్రమ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. Exclusive: Wasim Akram opens … Read more

    పుణేలో లారీ బీభత్సం ,30 మందికి గాయాలు

    మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ[ బీభత్సం](url) సృష్టించింది. బెంగళూరు హైవేలోని నావెల్ వంతెనపై ముందున్న వాహనాలను వేగంగా ఢీకొట్టింది. సుమారు 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు…ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగ నిర్ధారించారు. అందులోని చమురు రోడ్డుపై పడటం వల్ల వాహనాలు జారి ప్రమాదానికి గురయ్యాయి. Horrible Accident at Navale Bridge Pune …. minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ … Read more

    గర్భిణీగా హారిక ప్రయాణం స్ఫూర్తిదాయకం

    చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక తను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు తన ప్రయాణాన్ని సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలా [వీడియో](url) రూపొందించింది. మూడో నెలలో ల్యాప్ టాప్ లో చెస్ ఆడుతూ …4,5 నెలల్లో కోచింగ్ తీసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎనిమిదో నెల ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించుకోగా…9వ నెలలో నిండు గర్భిణీగా ఉండి చెస్ ఒలింపియాడ్ ఆడి గెలిచింది. ఆగస్టు 24న పాపకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared … Read more

    జైలులో మంత్రికి మసాజ్

    మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు తీహర్ జైలులో సకలభోగాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన జైలులో ఏకంగా మసాజ్ చేయించుకుంటున్న[ వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైన్ కు అక్కడ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని, వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపిన కొన్ని రోజులకే వీడియో బయటకు వచ్చింది. భాజపా నేత షెహజాద్ పూనావాలా ఈ వీడియోను షేర్ చేశారు. నిబంధనలు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. So instead of Sazaa – Satyendra … Read more

    జైలర్ చిత్రంలో రజినీ స్టైల్ అదుర్స్

    సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ చిత్రం నుంచి చిన్న మేకింగ్ [గ్లింప్స్](url) విడుదల చేశారు. ఇందులో రజినీ స్టైల్ ఆకట్టుకుంటోంది. జైలర్ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్నారు. ప్రమఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ అదరగొడుతున్నాయి. ఇందులో శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది Here’s a glimpse of Superstar @rajinikanth from the sets of … Read more

    RC15 షూటింగ్ కి చరణ్ రెఢీ

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ చిత్రానికి సంబంధించి తదుపరి షెడ్యూల్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. సినిమాలోని ఓ పాటను చిత్రీకరించనున్నారు. 12 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరగనుంది. చరణ్, కియారాపై చిత్రీకరిస్తున్న ఈ పాటలో శంకర్ మార్క్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సినిమా పాటలు అదిరిపోతాయని తమన్ చెప్పాడు.ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న రామ్ చరణ్…అక్కడ కూడా కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ[ వీడియో](url) చక్కర్లు కొడుతోంది. No One Can Beat Him In Offline Looks … Read more

    తెదేపా నాయకుడిపై కత్తి దాడి

    కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరి రావును హత్య చేసేందుకు ప్రయత్నించాడు. భవాని మాల వేషధారణలో వచ్చిన నిందితుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. శేషగిరిరావు తలకు, చేతికి తీవ్ర గాయాలవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బైక్ పై పారిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శేషగిరిరావును సీనియర్ నేతలు యనమల, రాజప్ప పరామర్శించారు.

    మెట్రో స్టేషన్ లో కాల్పులు

    ఇరాన్ లోని టెహ్రాన్ లో కాల్పుల కలకలం రేగింది. మెట్రో స్టేషన్ లో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా బయటకు పరుగులు తీసేందుకు తోసుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు పడ్డారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. భద్రతా దళాలు కాల్పులు ఎందుకు జరిపారో తెలియాల్సి ఉంది. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on … Read more