తమిళ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan)కు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన చేసిన ‘రెమో’, ‘డాక్టర్ వరుణ్’, ‘డాన్’, ‘ప్రిన్స్’ చిత్రాలు తెలుగులో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ‘అయలాన్’ కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజై భారీ కలెక్షన్లు సైతం రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగులో ఓటీటీ వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాకైనట్లు తెలుస్తోంది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘అయలాన్’ చిత్రం ఇప్పటికే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సన్ నెక్ట్స్ (Sun NXT).. ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి తెలుగు వర్షన్ కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు మెుదలు పెట్టింది. ఏప్రిల్ 19 నుంచి అయలాన్ తెలుగులో స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై రెండ్రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని సన్ నెక్స్ట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అయలాన్ తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడో రావాల్సింది.. కానీ!
వాస్తవానికి సంక్రాంతి కానుకగానే తమిళంతో పాటు తెలుగులోనూ ‘అయలాన్’ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఆ సమయానికి తెలుగులో ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామి రంగ’ వంటి బడా చిత్రాలు ఉండటంతో వాయిదా పడింది. తర్వాత రిలీజ్ చేయాలని భావించిన అది సాధ్యపడలేదు. దీంతో థియేటర్‌లో కాకపోయినా ఓటీటీలోనైనా రిలీజ్ చేస్తారేమోనని తెలుగు ప్రేక్షకులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ల తర్వాత తెలుగు ఓటీటీ వెర్షన్‌పై అప్‌డేట్ రావడంతో ఆనందిస్తున్నారు. కాగా, సైన్స్ ఫిక్షన్ తరహాలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.96 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం.
కథ ఏంటంటే?
తామిజ్ (శివకార్తికేయన్) సాధారణ రైతు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగం కోసం సిటీకి వస్తాడు. మరోవైపు పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా నోవా గ్యాస్‌ను కనిపెట్టేందుకు సైంటిస్ట్ ఆర్యన్ (శరద్ ఖేల్కర్) యత్నిస్తుంటాడు. ఈ పరిశోధన ఎంతో ప్రమాదకరమైనది కావడంతో ఓ మైన్‌లో రహస్యంగా ఈ ప్రయోగం చేస్తుంటాడు. ఇందుకు స్పార్క్ అనే గ్రహశకలాన్ని వినియోగిస్తుండంతో ఆర్యన్‌ను అడ్డుకునేందుకు టట్టూ అనే ఏలియన్ భూమిపైకి వస్తుంది. మరి ఆ ఏలియన్ తామిజ్‌ను ఎలా కలిసింది? ఆర్యన్ గ్యాంగ్‌తో ఏలియన్‌కు ఏర్పడిన ఇబ్బంది ఏంటి? ఆర్యన్ చేసిన ప్రయోగం కారణంగా చెన్నై నగరానికి వచ్చిన ముప్పు ఏంటి? అన్నది కథ
కార్తికేయ.. వన్ మ్యాన్ షో
అయలాన్ చిత్రం హీరో శివకార్తికేయన్ వన్ మ్యాన్ షో చేశాడు. తామిజ్ పాత్రలో ఒదిగిపోయాడు. అతడికి ఏలియన్‌కు మధ్య వచ్చే వినోద సన్నివేశాలు మెప్పిస్తాయి. సెకండ్ హీరోగా ఏలియన్ పాత్ర ఆకట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్, యోగిబాబు, కరుణాకరణ్ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. నెగెటివ్ పాత్రల్లో ఇషా కొప్పికర్, శరద్ ఖేల్కర్ చక్కగా నటించారు. అటు దర్శకుడు రవికుమార్.. సాధారణ కథకు ఏలియన్ ఎలిమెంట్ జోడించి మంచి సక్సెస్ సాధించాడు. ‘ఏలియన్ శక్తులు హీరోకి బదిలి అవ్వడం’ అన్న కాన్సెప్ట్ తీసుకురావడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఇక ఏలియన్ కనిపించే ప్రతీ సీన్‌లో వీఎఫ్‌ఎక్స్ టీమ్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఓవరాల్‌గా కుటుంబమంతా కలిసి ఏంచాక్క ‘అయలాన్’ను వీక్షించవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!