టాలీవుడ్‌లో మరొ కొత్త హీరోయిన్ పేరు మార్మోగుతోంది. ఆ ముద్దుగుమ్మే భాగ్యశ్రీ బోర్సే. ఈ మధ్య కాలంలో శ్రీలీల తర్వాత అంతటి క్రేజ్ ఈ యంగ్ హీరోయిన్ సంపాదించింది. ఇంకా తాను నటించిన సినిమా విడుదల కాకముందే.. ఏకంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ఈ అమ్మడిని వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి పడుతున్నాయి.
తాజాగా ఆమె నటించిన మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమా ఆగస్ట్ 15న విడుదలకానుంది. ప్రమోషన్ ఈవెంట్లలో చురుకుగా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చూస్టుంటేనే కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఉన్న ఈ బాలీవుడ్ సుందరి.. టాలీవుడ్‌లో జెండా పాతేందుకు సిద్ధమైంది
గతంలో ఇదే హైప్‌తో వచ్చిన కన్నడ సోయగం శ్రీలీలక ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది.
పెళ్లిసందD చిత్రం తర్వాత శ్రీలీల (Sreeleela) ఎలాగైతే తన గ్లామర్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు చెక్ పెట్టిందో అదే విధంగా మిస్టర్ బచ్చన్‌తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది.
ఇక మిస్టర్ బచ్చన్ చిత్రం హిట్ కొడితే మాత్రం భాగ్యశ్రీ స్టార్ హీరోయిన్‌గా మారడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఈ సినిమా హిందీ హిట్ చిత్రం రైడ్‌కు రిమేక్ కావడంతో… తెలుగులోను హిట్ అవుతుందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆ చిత్రం జయపజయాలతో సంబంధం లేకుండా ఆమె గ్లామర్ టాలీవుడ్‌లో రాణించేందుకు దోహద పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే మిస్టర్ బచ్చన్ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌లో ఈ అమ్మడి అందాల ప్రదర్శన టాక్ అఫ్ ది టౌన్‌గా మారింది. కుర్రకారులో మంచి జోష్‌తో పాటు మంచి క్రేజ్ సంపాదించింది.
ఇప్పటికే రవితేజ, విజయ్‌దేవరకొండ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో సినిమాకు ఓకే చెప్పింది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగులో నేరుగా చేయబోయే చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.
గతంలో దర్శకుడు పరుశురామ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు నెచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజిత్ కాంబోలో వస్తున్న సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మకు అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక భాగ్యశ్రీ బోర్సే నేపథ్యం పరిశీలిస్తే.. ఈ ముద్దుగుమ్మ పుణేలో జన్మించింది.
హిందీ చిత్రం ‘యారియాన్ 2’తో భాగ్యశ్రీ బోర్సే తెరంగేట్రం చేసింది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది.
ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది.
‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్’లో ఛాన్స్ ఇచ్చారు.
భాగ్యశ్రీ బోర్సే గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.