• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LUCKY CHANCE: అబుదాబీ లక్కీ డ్రాలో రూ.2 కోట్లు గెలుచుకున్న హైదరాబాదీ

    అదృష్టం కలిసిరాకపోతుందా అని ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఒక్క క్షణం అది మన సొంతమైతే జీవితం మారిపోతుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సరిగ్గా అలాంటి రోజే యూఏఈలో నివసిస్తున్న హైదరాబాదీకి వచ్చింది. అదృష్టం ఆమెను పడిశం పట్టినట్లే పట్టింది. ప్రతీ వారం తీసే లక్కీ డ్రాలో ఏకంగా రూ. 2 కోట్లకు పైగా గెలుచుకుంది ఆ మహిళ.  లక్కీ ఛాన్స్‌ హైదరాబాద్‌కు చెందిన హమీదా బేగం అబుదాబీలో మూడేళ్లుగా నివసిస్తోంది. మెడికల్‌ కోడర్‌గా పనిచేస్తోంది. అక్కడ ప్రతీ వారం మహ్‌జూజ్‌ లక్కీ … Read more

    TUNNEL AQUARIUM:హైదరాబాద్‌ నడిబొడ్డున టన్నెల్ ఎక్వేరియమ్… 60 కిలోల చేపను వెళ్లి చూడండి

    హైదరాబాద్‌లో మరో అద్భుతం కనివిందు చేయనుంది. నగరవాసులు వేసవిలో ఎంజాయ్ చేసేందుకు నీటి లోపల ఆక్వా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. జలాంతర్గామి మాదిరిగా ఉండే ఈ టన్నెల్‌ లోపల వేల రకాల చేపలను ఉంచారు. మహా నగరంలో ఇదెక్కడ ఉంది? దీన్ని సందర్శించాలంటే ఎంత చెల్లించాలి అనే విషయాలు తెలుసుకోండి. ఆక్వా ఎగ్జిబిషన్ వివిధ దేశాల్లో నీటి లోపల టన్నెల్‌ను ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల చేపలను దగ్గర్నుంచి చూసేలా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవి కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు. ఇలాంటి … Read more

    ఈ వారం(April 21) థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు

    వేసవి కాలం వచ్చేసింది. కొద్ది రోజుల్లో విద్యార్థులకు సెలవలు వస్తాయి. పిల్లలు, పెద్దలు దొరికిన కాస్త సమయాన్ని సినిమాలు చూడటానికి కేటాయిస్తారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఒకసారి అవెంటో తెలుసుకోండి. విరూపాక్ష సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన విరూపాక్ష ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విభిన్నమైన కథతో కార్తీక్ దండు తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలు చూసే వారికి ఇది కచ్చితంగా … Read more

    NANDINI GUPTHA: 19 ఏళ్ల అమ్మాయి… మిస్ ఇండియాగా గెలిచి ప్రపంచ వేదికపైకి !

    తొమ్మిదేళ్ల కల.. వయసు 19 ఏళ్లు.. ఆశయానికి అనుగుణంగా కష్టపడిన ఆమెను విజయం వరించింది. రాజస్థాన్‌కు చెందిన నందినీ గుప్తా మిస్‌ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది ఈ సుందరి. ఆమె గురించి మరిన్ని వివరాలు  తెలుసుకుందాం.  మిస్ ఇండియా 2023 మిస్ ఇండియా పోటీల్లో రాజస్థాన్‌ కోటాకు చెందిన నందనీ గుప్తా గెలుపొందింది. మణిపూర్‌లో జరిగిన 59వ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ… కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 15న … Read more

    CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!

    విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్‌. ఆయన ఎవరో కాదు చియాన్‌ విక్రమ్. ఎలాంటి గెటప్‌నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.  శివ పుత్రుడు పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. … Read more

    SAMANTHA: సమంత కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడిందా? ఖుషీ సినిమానే చివరిదా?

    సమంత…. నిన్న మెున్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. కానీ, ప్రస్తుతం సీన్ మారిపోయింది. ఒకప్పుడు చేతినిండా ఆఫర్లతో బిజీగా గడిపిన సామ్‌కు… ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా మినహా మరొకటి లేదు. బాక్సాఫీస్‌ వద్ద ఆమె చిత్రాలు పెద్దగా ఆడకపోవటంతో పాటు అటు మయోసైటిస్ సమస్యలు కూడా వేధిస్తుండటంతో సామ్ కెరీర్‌ దాదాపు ముగిసిందనీ సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.  ఇండస్ట్రీలో ఇక కష్టమే సమంతకు గత కొన్నేళ్లుగా చెప్పుకోదగిన హిట్‌ పడటం లేదు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు … Read more

    క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు

    క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకునే సౌలభ్యాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ కల్పిస్తోంది. త్వరలోనే దీనిని అమలులోకి తీసుకు రానున్న తొలి బ్యాంకుకా ఘనత సాధించనుంది. డిజిటల్ వ్యాలెట్‌తో కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డును లింక్ చేసుకుని యూపీఐ చెల్లింపులు జరపొచ్చు. రూపే కార్డులకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుంది. ఈ సేవలను పొందడానికి ముందుగా క్రెడిట్ కార్డును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసి.. క్రెడిట్ కార్డు ఆప్షన్‌ని ఎంచుకున్న అనంతరం వివరాలు సమర్పించాలి. త్వరలో మిగతా … Read more

    కేఎల్ రాహుల్ మరో రికార్డ్

    లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 105 ఇన్నింగ్స్‌ల్లోనే 4 వేల రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాడిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో గేల్(112), వార్నర్(114), కోహ్లీ(128), డివిలియర్స్(131) లాంటి ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డుతో రాహుల్ మెరిశాడు. గత కొంతకాలంగా రాహుల్‌ సరైన ఫామ్‌లో లేడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లోనూ … Read more

    హ్యారీ బ్రూక్ సెంచరీ: గర్ల్‌ఫ్రెండ్ చూస్తుండగా!

    కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాల నుంచి బయటపడి శతకంతో సత్తాచాటాడు. ఈ సెంచరీని తన గర్ల్‌ఫ్రెండ్ లూసీ లైల్స్ చూస్తుండగా బాదడం విశేషం. ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం బ్రూక్ కోల్‌కతా బౌలర్లపై కనికరం లేకుండా చెలరేగిపోయాడు. కాగా బ్రూక్ రెండేళ్లుగా లూసీతో డేటింగ్ చేస్తున్నాడు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు ఏమైనా చేస్తారని నెటిజన్లు అంటున్నారు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇరగదీసిన బ్రూక్‌ను సన్‌ రైజర్స్ … Read more

    Vidudhala Review: NTR దర్శకుడు వెట్రిమారన్‌ ‘విడుదల’ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

    నటీనటులు: సూరి, విజయ్‌ సేతుపతి, భవానీ శ్రీ, గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, రాజీవ్‌ మీనన్‌  దర్శకత్వం: వెట్రిమారన్‌ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: ఆర్‌.వేల్‌రాజ్‌ ఎడిటింగ్‌: రమర్‌ నిర్మాత: ఎల్రెడ్‌ కుమార్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌కు తమిళంలో ఎంతో గుర్తింపు ఉంది. హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆయన పలు జాతీయ అవార్డులను అందుకున్నాడు. అత్యంత సహజంగా కనిపించేలా ఆయన తీసిన విసరనై, వడా చెన్నై, అసురన్‌ వంటి సినిమాలు వెట్రిమారన్‌కు ప్రతిభకు అద్దం పడతాయి.  తమిళ్‌లో ఆయన తీసిన ‘అసురన్’ చిత్రం ఓ … Read more