యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరో రెండ్రోజుల్లో సెప్టెంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటించింది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. దీనికి తోడు తారక్ ద్విపాత్రాభినయం చేస్తుండటంతో ఈ సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే దేవర పలు రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. తాజాగా తన పేరిట మరో రికార్డును లిఖించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది.
ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘దేవర’ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
బాహుబలి స్థాయిలో క్లైమాక్స్
‘దేవర’ సినిమాలో చివరి 40 నిమిషాలు హైలైట్ అని ఎన్టీఆర్ (NTR) ఇటీవల స్వయంగా చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ దేవర క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మాట్లాడుతూ దేవర క్లైమాక్స్ బాహుబలిని పోలి ఉంటుందని తెలిపారు. ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఈ మూవీపై వస్తోన్న ఫేక్ న్యూస్‌పైనా రత్నవేలు స్పందించారు. ఇందులో తారక్ మూడు పాత్రలు పోషించారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ఫ్యాన్స్‌కు నాగవంశీ రిక్వెస్ట్
దేవర డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన నిర్మాత నాగవంశీ అభిమానులకు ఎక్స్ వేదికగా ఓ రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమాతోనైనా ఫ్యాన్ వార్‌కు ముంగింపు పలకాలని కోరారు. అలాగే ఫస్ట్ స్క్రీనింగ్‌లో సినిమా చూసే వారు సినిమాకు సంబంధించిన సీన్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టవద్దని కోరారు. మీ తర్వాత చూసే అభిమానులూ సినిమాని ఎంజాయ్ చేయనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తారక్ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్ అందిద్దామని పిలుపునిచ్చారు. పోస్ట్ చివర్లో ‘దేవర సెప్పిండు అంటే సేసినట్టే’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. నాగవంశీ విజ్ఞప్తిని నెటిజన్లు స్వాగతిస్తున్నారు.
రన్‌టైమ్‌లో మార్పులు
‘దేవర’ (Devara) సినిమా నిడివిలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఫైనల్ చేసిన నిడివిలో దాదాపు 7 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు సమాచారం. 170.58 నిమిషాల (2: 50 గంటలు) రన్‌టైమ్‌తో (Devara Movie RunTime) ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సురక్షిత ప్రయాణ సందేశం, ధూమపానం హెచ్చరికలాంటివి మినహాయిస్తే ఈ మూవీ లెంగ్త్ 2:42 గంటలుగా ఉండనుంది. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన ఈ సినిమా నిడివి ఇంతకుముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉంది. ప్రాధాన్యం లేని సన్నివేశాలను తీసివేసినట్లు తెలుస్తోంది.
టికెట్ల రేటు పెంపు
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర టికెట్ల ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబరు 27 న 29 థియేటర్లలో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో స్పెషల్ షోస్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా తొలిరోజున వేసే అన్ని షోలపై రూ.100 పెంచుకోవచ్చని సూచించింది. అటు ఏపీ ప్రభుత్వం టికెట్‌పై రూ.60 నుంచి రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.
దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?