టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్థార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ‘దేవర’ (Devara) షూటింగ్లో తారక్ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలై ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘చుట్టమల్లే ‘(Chuttamalle Song) అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే అదే సమయంలో ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ సైతం వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్!
తారక్ హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంపై తొలి నుంచి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ఫియర్’ సాంగ్ ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే సోమవారం ‘దేవర’ నుంచి రెండో పాట రిలీజ్ చేశారు. ‘చుట్టుమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌లో తారక్, జాన్వీ కపూర్ అదరగొట్టారు. ఈ జోడీ కెమెస్ట్రీ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెట్టారు. అటు మ్యూజిక్ లవర్స్ నుంచి కూడా ఈ పాటకు విశేష స్పందన వస్తోంది. ఫలితంగా యూట్యూబ్‌లో 40 మిలియన్ వ్యూస్‌ను ఈ సాంగ్ సొంతం చేసుకుంది. రిలీజైనప్పటి నుంచి అగ్రస్థానంలో ట్రెండింగ్ అవుతూ మరింత దూసుకెళ్తోంది.
పెద్ద ఎత్తున ట్రోల్స్!
‘చుట్టమల్లే చుట్టేస్తోంది’ సాంగ్‌ను కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ పాట సోప్ యాడ్‌ను తలపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్‌లోని సీన్స్‌కు సోప్ యాడ్ మ్యూజిక్‌ను జత చేసి ట్రెండింగ్ చేస్తున్నారు. అటు మీమ్స్ పేజెస్ సైతం సదరు వీడియోను పోస్టు చేస్తుండటంతో ఎడిటింగ్ వీడియోలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సాంగ్ ట్యూన్‌ని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కాపీ కొట్టాడని కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో బాగా పాపులర్ అయిన ‘మనికే మగే హితే’ పాటతో కంపేర్ చేస్తున్నారు. ఆ ట్యూన్‌కు దగ్గరగా ఉందటూ సదరు సాంగ్‌ను సైతం వైరల్ చేస్తున్నారు. దీంతో ‘చుట్టుమల్లే’ సాంగ్ ఒకే సమయంలో పాజిటివ్, నెగిటివ్ టాక్ తెచ్చుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
స్ట్రాంగ్ కౌంటర్
దేవర సెకండ్ సింగిల్‌పై వస్తోన్న ట్రోల్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఎవరు ఏం అనుకుంటే మనకేంటి సాంగ్ మాత్రం సూపర్ అంటూ ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు. ‘గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్ వస్తున్నాయి. ఆఫీషియల్ ఈ సాంగ్ జోష్ ఎలా ఉంది బాయ్స్? ఇందులో తారక్ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్‌ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కదా బాయ్స్..’ అంటూ నాగవంశీ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు. కొందరు నెటిజన్లు నాగవంశీకి మద్దతుగా నిలుస్తున్నారు. తమకు ఈ పాట విపరీతంగా నచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘దేవర’ వచ్చేస్తునాడు..!
‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సోదరుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోస్టల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ మాత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంపై హింట్స్ ఇస్తున్నాయి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్