ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది.
జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం.
డీసీపీ రాహల్ ఏమన్నారంటే..
కాగా, డింపుల్ హయాతిపై నమోదైన కేసుపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తనకు హీరోయిన్ డింపుల్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.
పార్కింగ్ స్థలంలో కారు తీసెటప్పుడు ఆమె కారు అడ్డుగా ఉండటంతో ఓసారి తాను డింపుల్‌ను రిక్వెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుండటం వల్ల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
ఈరోజు కూడా ఓ ఎమర్జెన్సీ పనిపై వెళ్లే క్రమంలో అడ్డుగా ఉన్న డింపుల్ కారును తీయాలని డ్రైవర్ రిక్వెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ కారును గుద్దడంతో పాటు కాలుతో తన్నిందని అది సీసీటీవీలో కూడా రికార్డైందని పేర్కొన్నారు. దీంతో తన డ్రైవర్ డింపుల్‌పై కేసు పెట్టినట్లు వివరించారు.
డింపుల్ రియాక్షన్
తాజా వివాదంపై డింపుల్ హయాతి కూడా రియాక్ట్ అయింది. ‘అధికారాన్ని ఉపయోగించడం వల్ల ఏ తప్పు ఆగదు, అధికార దుర్వినియోగం తప్పులను దాచదు’ అంటూ ట్వీట్ చేసింది. ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది.
డింపుల్ కోపానికి కారణం ఇది!
తాజా వివాదం నేపథ్యంలో డీసీపీ రాహుల్ హెగ్డే, డింపుల్ మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత వారం రోజులుగా డింపుల్ కారుపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నట్లు తెలిసింది.
ట్రాఫిక్ డీసీపీతో తలెత్తిన వివాదం వల్లే తన కారుకు అధికంగా చలాన్లు పడుతున్నట్లు డింపుల్ హయాతి భావించింది. ఈ నేపథ్యంలో తన ఫ్రస్టేషన్ అంతా రాహుల్ హెగ్డే కారుపై చూపించినట్లు తెలుస్తోంది.
డింపుల్ హయాతి 2017లో ‘గల్ఫ్’ సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో ‘యురేక’ సినిమాలో ఆమె నటించింది.
అభినేత్రి 2 సినిమాలో తన నటనతో డింపుల్ ఆకట్టుకుంది. గద్దల కొండ గణేష్ చిత్రంలో జర్ర జర్ర పాటలో స్టెప్పులేసి తెలుగు యువతను అలరించింది.
ఆ తర్వాత ‘సామాన్యుడు’, ‘ఖిలాడి’ సినిమాలతో డింపుల్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల రిలీజైన ‘రామబాణం’ లోనూ డింపుల్ హీరోయిన్‌గా చేసింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!