సినిమాలపై ఆసక్తితో క్లాప్ డైరెక్టర్‌గా ప్రారంభమైన ప్రస్థానం నేచురల్ స్టార్ వరకు సాగింది. సినీ నేపథ్య కుటుంబం లేనప్పటికీ స్వతహాగా తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు నేచురల్ స్టార్ నాని. పాత్ర ఏదైనా మన పక్కింటి కుర్రాడిలా నటించేస్తాడు. భారీ కటౌట్ లేకున్నా తనకున్న యాక్టింగ్ స్కిల్స్‌తో అదరగొట్టేస్తాడు. అందుకే ఈ యంగ్ హీరోని అభిమానులు అమితంగా ఆరాధిస్తారు. మరి ఇంతలా సినీ ప్రేమికుల మదిని దోచుకున్న ఈ హీరో గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
నాని ఎవరు..?
హీరో, నిర్మాత, టీవీ ప్రజెంటర్
పుట్టిన రోజు ఎప్పుడు..?
1984, ఫిబ్రవరి 24న రాంబాబు-విజయలక్ష్మి దంపతులకు హైదరాబాద్‌లో జన్మించాడు. ఇతడి అసలు పేరు ఘంటా నవీన్ బాబు. విద్యాభ్యాసం అంతా కూడ నగరంలోనే పూర్తి చేసుకున్నాడు. వరల్డ్ స్పేస్ శాటిలైట్‌లో రేడియో జాకీగా కొంతకాలం వర్క్ చేశాడు.
వయస్సు, ఎత్తు ఎంత?
నాని వయస్సు 38 సంవత్సరాలు. ఎత్తు 5’8/1.68 మీటర్లు
ఎన్ని సినిమాల్లో హీరోగా నటించాడు..?
నాని దాదాపు 30 సినిమాల్లో హీరోగా నటించాడు. త్వరలో ‘అంటే సుందరానికి, దసరా’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇతడు హిట్, మీట్ క్యూట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అలాగే మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్ షోలకు హోస్టుగా కూడ చేశాడు. ఇతడు వెప్పం అనే సినిమాలో కూడ హీరోగా నటించాడు.
బాల్య నటుడిగా ప్రస్థానం ఎప్పుడు..?
ఇతడిది సినీ నేపథ్య కుటుంబం కాకపోవడంతో లేటుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దర్శకుడిగా రాణించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ బాపూ దగ్గర అస్టిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. కాని అనుకోకుండా 2008లో మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వృత్తిపరమైన జీవితంలో వెనుకడుగు వేయలేదు. ప్రముఖ యాంకర్ ఝాన్సీ ఇతడికి దూరపు బంధువు అని సమాచారం.
నాని భార్య ఎవరు..? పెళ్లి ఎప్పుడు జరిగింది..?
బెస్ట్ ఫ్రెండ్ అయిన అంజనను ప్రేమించి 2012, అక్టోబర్ 27న వివాహం చేసుకున్నాడు. వైజాగ్‌లో ఆర్జేగా వర్క్ చేస్తున్నప్పుడు అంజనతో పరిచయం ఏర్పడింది. దాదాపు 5 ఏళ్లు ఫ్రెండ్స్‌గా కొనసాగి తదనాంతరం పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. వీరికి 2017లో బాబు పుట్టాడు. అతడి పేరు అర్జున్.
నేచురల్ స్టార్ ముద్దు పేర్లు ఏంటి..?
నవీన్ బాబుగా పిలువబడే ఇతడిని అభిమానులు ముద్దుగా నాని అని పిలుస్తుంటారు. అలాగే నేచురల్ స్టార్ అంటూ తమ అభిమానం చాటుకుంటారు. ఫ్యామిలీ అడియన్స్ పక్కింటి కుర్రాడంటూ సంభోదిస్తుంటారు.
నానికి ఇష్టమైన మూవీ ఏది..?
నానికి ఇష్టమైన ఆల్ టైం ఫేవరెట్ మూవీ పెదరాయుడు. ఈ మూవీలో మోహన్ బాబు, రజినీకాంత్ నటన చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందంటూ పేర్కొన్నాడు. అలాగే ఇతడు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి మణిరత్నం మూవీలు చాలా ప్రభావం చూపాయని ఒకానొక సందర్భంలో పేర్కొన్నాడు.
ఇష్టమైన ఫుడ్, పుస్తకం, వ్యాపకాలు..?
ఇష్టమైన ఫుడ్ ఇడ్లీ సాంబార్, కిచిడి. నచ్చిన పుస్తకం ఏంటో ప్రత్యేకంగా చెప్పనప్పటికి..ఇతడు డైరెక్టర్ అవ్వాలనుకున్న రోజుల్లో స్క్రిప్ట్స్ రాస్తుండేవాడట. వ్యాపకాలు ట్రావెలింగ్, ప్లేయింగ్ క్రికెట్.
ఎన్ని అవార్డులు వరించాయి..?
నాని రెండు నంది, ఒక ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు దక్కించుకున్నారు. అలాగే జీ సినిమా, సినిమా, విజయ్, ఇతర అవార్డులు వరించాయి.
కాంట్రవర్సీలు
ఇతడు అనేకసార్లు కాంట్రవర్సీలో నిలిచారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ శ్రీరెడ్డి ఆరోపించారు. అలాగే ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడంపై కూడ నాని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆ సందర్భంలో ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి. టక్ జగదీశ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అవ్వడం కూడ వివాదంగా మారింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!