• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Gaami OTT Date: ‘గామి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ లాక్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

    యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గామి’ (Gaami). భారీ అంచనాల మధ్య మార్చి 8న విడుదలైన ఈ చిత్రం.. థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో విశ్వక్‌ ఆకట్టుకున్నాడంటూ పెద్ద వార్తలు వచ్చాయి. అటు సినీ విమర్శకులు సైతం విశ్వక్‌ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అంటూ ఆడియన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ డేట్‌ లాక్‌ అయినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే!

    గత నెల థియేటర్లలోకి వచ్చిన ‘గామి’ (Gaami OTT Release Date) మూవీ ఓటీటీ హక్కులను జీ5 (Zee 5) సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌పై గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. పుకార్లు తప్ప ఇప్పటి వరకూ Zee5 నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే లేటెస్ట్‌గా ‘గామి’ ఓటీటీ విడుదలపై స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 12న ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై జీ5 రెండ్రోజుల్లో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా చేస్తుందని అంటున్నారు. దీంతో ‘గామి’ కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    ఆ లోటును తీర్చిన ‘గామి’

    విశ్వక్ సేన్ ఇప్పటివరకూ లవర్‌ బాయ్‌ పాత్రలు, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ స్టోరీల్లోనే ఎక్కువగా నటించాడు. అయితే ఇటీవల వచ్చిన ‘గామి’ (Gaami OTT Release Date)లో మాత్రం అతడిది పూర్తి భిన్నమైన పాత్ర. విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అతడు అఘోరా పాత్రలో కనిపించి అలరించాడు. ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీలో అదరగొట్టాడు. గామి ఓ భిన్న‌మైన ప్ర‌య‌త్నంగా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. ప్ర‌యోగాత్మ‌క సినిమాలు తెలుగులో రావ‌డం లేద‌నే లోటును ‘గామి’ కొంత వ‌ర‌కు తీర్చింది. శంక‌ర్ అనే అఘోరా పాత్ర‌ కోసం విశ్వ‌క్‌ సేన్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. 

    కథ ఏంటంటే?

    అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. మానవ స్పర్శ తగిలితే అతడికి ప్రాణం పోయేంత బాధ కలుగుతుంది. ఎవరూ ముట్టుకోవడానికి వచ్చినా చర్మ పగిలిపోతుంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉందని ఓ సాధువు చెబుతాడు. 36 ఏళ్లకు ఒకసారి వికసించే పుష్పాన్ని తాకితే సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తాడు. దీంతో ఆ పుష్పాలను అన్వేషిస్తూ శంకర్‌ హిమాలయాలకు బయలుదేరుతాడు. మరోవైపు సమాంతర ప్రపంచంలో ఓ దేవదాసి (అభినయ) బిడ్డకు జన్మనివ్వడంతో ఊరి ప్రజలు ఆమెను తరిమేస్తారు. అలాగే ఓ రహస్య ప్రదేశంలో మానవులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ సబ్‌ప్లాట్స్‌తో అఘోరా శంకర్‌కు సంబంధం ఏంటి? హిమాలయాలకు వెళ్లిన శంకర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది కథ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv