ప్రస్తుతం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో భారీగా అంచనాలు ఉన్నాయి. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్, అబ్బుపరిచేలా గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ బజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
రెండు కంటే ఎక్కువ భాగాలుగా!
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ సైతం మెుదలు పెట్టింది. ఇప్పటికే విడుదలైన భైరవ (ప్రభాస్) బుజ్జి వీడియో అభిమానులకు సర్‌ప్రైజ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన ఓ అప్‌డేట్ సైతం ఫ్యాన్స్‌ను మరింత ఖుషి చేస్తోంది. దీని ప్రకారం కల్కి చిత్రం రెండు కంటే ఎక్కువ భాగాలుగా రానున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
కారణం ఇదేనట!
‘కల్కి 2898 ఏడీ’ కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్. బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు రెండు కంటే ఎక్కువ భాగాలు అవసరం అవుతాయని మేకర్స్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మెుదట కల్కీకి సంబంధించి ఓ సీక్వెల్ ప్లాన్ చేయాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. సీక్వెల్‌లోనూ కథ చెప్పలేకపోతే మిగతా పార్ట్స్ గురించి ఆలోచించాలని మేకర్స్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నేడు బిగ్ ఈవెంట్
‘కల్కి’ సినిమాకు సంబంధించి ఇవాళ (మే 22) రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించనుంది. ఇప్పటికే స్టేజీ సిట్టింగ్ కూడా రెడీ అయ్యింది. సా. 5 గంటలకు ఈ వేడుక మెుదలకానుంది. కల్కి సినిమా మెుదలు పెట్టిన తర్వాత భారత్‌లో చేస్తున్న తొలి ఈవెంట్ కావడంతో దీనిపై అందరిలోనూ హైప్ ఏర్పడింది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్‌తో పాటు మూవీ యూనిట్ అంతా వస్తారని సమాచారం. కల్కి సినిమాలో భైరవ (ప్రభాస్), బుజ్జి మధ్య రిలేషన్ ఏంటో ఈ ఈవెంట్‌లో చెప్పనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!