RBI నిబంధనల మేరకు సెప్టెంబర్‌లో ఆర్థికపర అంశాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటో చూద్దాం.
**డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు:** సెప్టెంబర్ నుంచి అనేక బ్యాంకులు కార్డులపై వార్షిక చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కార్డ్ ఇన్‌పుట్‌లలో ఉపయోగించే చిప్‌ల ధర భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి.
**ఐటీ రిటర్న్స్ గడువు:**
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి వెరిఫికేషన్‌కు ఈ నెల 7తో గడువు ముగుస్తుంది. రిటర్న్‌లు సబ్మిట్ చేసిన 30 రోజుల్లోగా ధ్రువీకరణ చేయాలి.
**టోకనైజేషన్:** అక్టోబర్ 1 నుంచి టోకనైజేషన్ సిస్టమ్ అమల్లోకి రానుంది. దీని ద్వారా ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు ఆన్‌లైన్ సర్వర్లలో, షాపింగ్ యాప్‌లలలో సేవ్ చేయడం కుదరదు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఫీజు పెంపు: NPS కింద సెప్టెంబర్ 1 నుంచి చెల్లింపుదారులు ఇకపై స్వచ్ఛంద పింఛను జమకు డబ్బు చెల్లించేటప్పుడు ఉన్న కమీషన్‌ను 0.10 శాతం నుంచి 0.20 శాతానికి పెంచారు.
**అటల్ పెన్షన్ యోజన:**
అక్టోబర్ 1 నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌కు అనర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అంతకంటే ముందు ఈ స్కీమ్‌లో ఉన్న వారు మాత్రం దీనిలో కొనసాగుతారు. ఈ పథకం అసంఘటిత కార్మికులకు నెలకు రూ.1,000-5,000 పెన్షన్‌ను అందిస్తుంది.
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!