భారత సైన్యంలోకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక ఆయుధాలు చేరాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాటిని ఆర్మికి అందజేశారు. ఫ్యూచర్ ఇన్‌ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్(F-INSAS), కొత్త తరం యాంటీ పర్సనల్ మైన్ ‘నిపున్’, ఆటోమేటిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, ట్యాంకులకు ఆధునీకరించిన సైట్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ థర్మల్ ఇమేజర్స్‌తో పాటు ఇన్‌ఫాంట్రీ ప్రొటెక్టెడ్ వెహికల్స్, ల్యాండింగ్ క్రాఫ్ట్ అసల్ట్ బోట్స్‌ను రాజ్‌నాథ్ అందించారు. ఆత్మనిర్భర్ కింద డీఆర్‌డీవో, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇందులోని చాలా రకాల ఆయుధాలు లద్ధాఖ్ సరిహద్దుల్లో ప్యాంగాంగ్ సరస్సులో విధులకు ఉపయోగపడనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి శత్రు కదలికలను పసిగట్టనున్నాయి. తూర్పు లద్ధాఖ్ సమీపంలో చైనా కవ్వింపులకు కళ్లెం వేసేందుకు ఈ నూతన ఆయుధాలు ఉపయోగపడనున్నాయి.
-
© ANI Photo
-
© ANI Photo
-