• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెళ్లి చేసుకుని పిల్లలను కనండి: జిన్‌పింగ్

  చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండంతో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌లో భయం నెలకొంది. ఈ నేపధ్యంలోనే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని మరోమారు ఆయన పిలుపునిచ్చారు. తాజాగా ఓ సమావేశానికి హాజరైన జిన్‌పింగ్‌ యువతులు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. 2022లో చైనా సంతానోత్పత్తి రేటు చారిత్రాత్మకంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెండింతలు పెరిగింది.

  రియల్‌మీలో టాప్ 7 స్మార్ట్ ఫోన్లు ఇవే!

  చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీకి ఇండియాలో రెడ్‌మీ తర్వాత ఆ స్థాయిలో మంచి గుడ్ విల్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్లకు ఇండియన్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ బడ్జెట్ నుంచి ప్రీమియం బడ్జెట్‌ వరకు ఫోన్లను రియల్‌మీ అందిస్తోంది. వాటిలో బెస్ట్ రేటింగ్ కలిగి, ఎక్కువ అమ్ముడు పోతున్న రియల్‌మీ ఫొన్లను మీకు అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన ఫోన్‌ను ఎంపిక చేసుకునేందుకు YouSay Webపై క్లిక్ చేసి కొనుగోలు చేసుకోండి.

  ఘనంగా ముగిసిన ఏసియన్ గేమ్స్

  ఏసియన్ గేమ్స్ ముగింపు వేడుకలను చైనా అద్భుతంగా నిర్వహించింది. హాంగ్‌జౌ ఒలింపిక్ క్రీడా కేంద్రం స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రేక్షకులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి మంత్రముగ్ధులను చేశారు. ఇండియన్ ఫ్లాగ్ బేరర్‌గా హాకీ ప్లేయర్ శ్రీజేష్ వ్యవహరించాడు. ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 12,407 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏసియన్ గేమ్స్‌లో చైనా అత్యధికంగా 383 పతకాలు సాధించగా, భారత్ 107 పతకాలతో నాలుగవ స్థానంలో నిలిచింది.

  చైనా వ్యక్తిని రక్షించేందుకు భారత్ సాహసోపేత ఆపరేషన్

  ఓ నౌకలో నడి సముద్రంలో ప్రయాణిస్తున్న చైనాకు చెందిన ఓ వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న సిబ్బంది అక్కడ నుంచి దగ్గరలోని భారత్ కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం పంపించారు. వెంటనే అలర్టైన కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. చిమ్మచీకట్లో హెలికాప్టర్‌లో బయలుదేరి నౌకలో ఉన్న చైనా వ్యక్తిని ఎయిర్‌లిఫ్ట్ చేసి హెలికాప్టర్‌లోనే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో చైనా నుంచి రీసర్చ్ నౌక సముద్రం మీదగా యూఈఏ వెళ్లోంది. In a … Read more

  చైనాలో మెస్సీకి చేదు అనుభవం!

  ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్ ఎయిర్‌పోర్టులో చైనా పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని.. కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని అడ్డగించారు. కానీ మెస్సీ తన దగ్గరున్న అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసినా వారు పరిగణలోకి తీసుకోలేదు. వెంటనే చైనా ఉన్నతాధికారులు స్పందించి మెస్సీకి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ వీసా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Lionel Messi got difficulty to enter China for his visa issue.He … Read more

  వివాదంలో చిక్కుకున్న దలైలామా

  [VIDEO](url): బౌద్ధ మత గురువు దలైలామా వివాదంలో చిక్కుకున్నారు. తన నాలుకను తాకాలంటూ ఓ బాలుడితో కోరినట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో దలైలామా ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చిన ఓ బాలుడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టుకున్నాడు. అనంతరం తన నాలుకను బయటపెట్టి.. దీన్ని తాకుతావా అంటూ సైగ చేశారు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆయన తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. So … Read more

  ‘వైట్‌పేపర్‌’తో అట్టుడుకుతున్న చైనా

  చైనాలో ‘జీరో కోవిడ్’కు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరం అవుతోంది. చైనా ప్రజలు[ ‘వైట్‌పేపర్’ ](url)విప్లవం చేస్తున్నారు. తెల్ల పేపర్‌పై ఏమీ రాయకుండానే వారు నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కాగా జీరో కోవిడ్ పేరిట ప్రజలను మూడేళ్లుగా చైనా నిర్బంధించింది. అన్ని దేశాల్లో మాస్కులు లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తుండగా.. చైనాలో మాత్రం ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. అందుకే వారు ఆందోళన చేస్తున్నారు. Hundreds of protesters in Beijing march with blank paper … Read more

  గొర్రెల వింత ప్రవర్తన; వీడిన మిస్టరీ

  చైనాలో గొర్రెల వింత ప్రవర్తన మిస్టరీ వీడింది. ఇటీవల పదుల సంఖ్యలో గొర్రెలు వలయాకారంలో తిరుగుతూనే ఉన్నాయి. దాదాపు 12 రోజులుగా అవి తిరుగుతూనే ఉండడంతో చైనా ప్రజలు వణికిపోయారు. దేశానికి ఏమైనా అరిష్టం పట్టుకుంటుందేమోనని వారు తెగ కంగారు పడిపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మిస్టరీని ఇంగ్లండ్‌కు చెందిన ప్రొఫెసర్ మ్యాట్ బెల్ చేధించారు. చాలాకాలంగా గొర్రెలు దొడ్డిలోనే ఉండటంతో బయటికి వచ్చాక కూడా అవి తమ పరిధిని దాటకుండా వలయాకారంలో తిరుగుతున్నట్లు తెలిపాడు. మొదట … Read more

  భీభత్సం సృష్టించిన టెస్లా కారు

  చైనాలో టెస్లా కారు భీభత్సం సృష్టించింది. సౌత్ ఫ్రావిన్సీ గ్వాంగ్‌డ్వాంగ్‌లో టెస్లా కారుకు బ్రేకులు పని చేయకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. [వీడియో](url) ప్రకారం కారు నియంత్రణ కోల్పోవడంతో అదుపులోకి రాలేదు. దీంతో కారు చాలా దూరం ప్రయాణించి స్తంభానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. This video of a Tesla trying to … Read more

  చైనాలో వైరల్‌ అవుతున్న హిందీ పాట

  చైనాలో కరోనా కారణంగా ఆంక్షల పర్వం కొనసాగుతున్న వేళ..అక్కడ ఓ బాలివుడ్‌ సాంగ్‌ వైరల్‌ అవుతోంది. 1982లో మిథున్‌ చక్రవర్తి హీరోగా వచ్చిన ‘డిస్కో డ్యాన్సర్‌’ సినిమాలోని ‘జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా’ అక్కడి సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. ప్రముఖ సింగర్, మ్యూజిక్‌ డైరక్టర్‌ బప్పీ లహరీ అప్పట్లో దీనికి సంగీతం అందించారు. మాండరిన్‌ భాషలో ‘జియ్‌ మీ, జియ్‌ మీ’ అంటే అర్థం ‘గివ్‌ మీ రైస్‌’ అని. అందుకే లాక్‌డౌన్‌పై సెటైరికల్‌ జిమ్మీ జిమ్మీ సాంగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. … Read more