• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mr. Bachchan Vs Double Ismart: డే 1 కలెక్షన్స్‌లో విన్నర్‌ ఎవరంటే?

    స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్‌ – పూరి కాంబోలోని ‘డబుల్ ఇస్మార్ట్‌’, రవితేజ – హరిష్‌ శంకర్‌ కలయికలో తెరకెక్కిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. అలాగే తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ చేసిన ‘తంగలాన్‌’, ఎన్టీఆర్‌ బావమరిది నటించిన ‘ఆయ్‌’ థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో రవితేజ, రామ్‌ చిత్రాలు మిశ్రమ స్పందన తెచ్చుకోగా, విక్రమ్‌, నార్నే నితిన్‌ చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజున ఏ చిత్రం కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టింది? ఈ కథనంలో తెలుసుకుందాం. 

    డబుల్ ఇస్మార్ట్‌ వసూళ్లు ఎంతంటే!

    రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart) చిత్రం తొలి రోజు డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ మంచి వసూళ్లను సాధించి పర్వాలేదనిపించింది. ఈ చిత్రం తొలిరోజున వరల్డ్‌ వైడ్‌గా రూ.12.45 కోట్లు (GROSS) రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.8.35 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌ కలిపి మరో రూ. 4 కోట్ల రాబడి వచ్చినట్లు తెలిపాయి. లాంగ్‌ వీకెండ్‌ కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి.

    మిస్టర్‌ బచ్చన్ పరిస్థితి ఏంటంటే!

    మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’ (Mr. Bachchan)పై రిలీజ్‌కు ముందు వరకూ భారీగా అంచనాలే ఉన్నాయి. అయితే గురువారం (ఆగస్టు 15) రిలీజైన ఈ మూవీ మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కాగా, వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఆగస్టు 14న వేసిన ప్రీమియర్ల ద్వారా రూ.1.8 కోట్లు వసూలైనట్లు పేర్కొన్నాయి. తొలి ఆట నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్‌ రావడం మిస్టర్‌ బచ్చన్‌ వసూళ్లపై ప్రభావం చూపినట్లు అభిప్రాయపడ్డాయి. అయితే లాంగ్‌ వీకెండ్‌ ఉండటంతో ఈ మూవీ పుంజుకునే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చాయి. కాగా, ఇందులో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ ద్వారానే తొలిసారి తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. 

    తంగలాన్‌ టాప్‌!

    తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ నటించిన ‘తంగలాన్‌’ చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను రాబట్టింది. రిలీజైన చిత్రాల్లో కెల్లా అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.26.44 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. నార్త్‌లో రిలీజ్‌ కాకుండానే ఈ స్థాయి వసూళ్లు సాధించడం పట్ల సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతోంది. ఇక నార్త్‌లో ఈ నెల 30న తంగలాన్‌ రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మంచి మౌత్‌ టాక్‌తో దూసుకెళ్తున్న తంగలాన్‌ ఈ వీకెండ్‌ పూర్తయ్యే సరికి భారీగానే వసూళ్లు సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో విక్రమ్‌ నటనపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. 

    ‘ఆయ్‌’కి మంచి వసూళ్లు!

    మ్యాడ్‌‘ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్‌ బామ మరిది నార్నె నితిన్‌ తన రెండో చిత్రం ‘ఆయ్‌‘ మరోమారు ప్రేక్షకులను పలకరించాడు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తొలి రోజు పాటిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక డే 1 కలెక్షన్ల విషయానికి వస్తే ఈ మూవీ రూ.2 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తొలి రోజే ఆకర్షణీయమైన వసూళ్లు సాధించడంతో చిత్ర యూనిట్‌ సంతోషంగా ఉంది. ఈ వీకెండ్‌ నాటికి ఈజీగానే లాభాల్లోకి వెళ్లిపోతుందని అభిప్రాయపడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv