ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ అంతా తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తద్వారా తమ మూవీ కలెక్షన్స్‌ను అమాంతం పెంచుకుంటున్నారు. అదే సమయంలో సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ‘బాహుబలి’తో మెుదలైన ఈ పరంపర ప్రస్తుతం పీక్స్‌కు చేరుకుంది. ‘పుష్ప’, ‘సలార్’, హనుమాన్, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ వంటి చిత్రాలు రెండు పార్ట్స్‌గా రాబోతున్నాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సైతం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ సీక్వెల్ ఫార్ములాకు జూ.ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సింగిల్ పార్ట్‌గా..
‘దేవర’ (Devara: Part 1) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్ నీల్ నుంచి సినిమా వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కూడా రెండు భాగాలుగా వస్తుందని అంతా భావించారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలుగా రాగా, ‘సలార్’కు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ఈ అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘NTR 31’ సింగిల్ పార్ట్‌గా తీసుకురావాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించారట. సింగిల్ పార్ట్‌లోనే కంప్లీట్ చేయాలని ఆయన భావిస్తున్నారట. అంతేకాదు మరీ లెంగ్తీగా కాకుండా రన్ టైమ్ విషయంలోనూ తారక్-ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
సీక్వెల్స్ అవసరమా!
దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ (Baahubali) చిత్రంతో ఈ సీక్వెల్స్‌కు పునాది వేశారు. అప్పటినుంచి తెలుగులో వరుసపెట్టి సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. ముందుగా చెప్పుకున్నట్లు ‘పుష్ప’, ‘సలార్’, హనుమాన్, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే కథ పెద్దగా ఉండి సింగిల్ పార్ట్‌లో చెప్పడానికి వీలుకానప్పుడు సీక్వెల్స్ ప్లాన్ చేయడంలో తప్పు లేదు. ప్రేక్షకులు సైతం దీనిని స్వాగతిస్తారు. కానీ కథలో దమ్ము లేకుండా అధిక కలెక్షన్స్ రాబట్టాలన్న ఉద్దేశ్యంతో సీక్వెల్స్‌కు ప్లాన్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. దేవర విషయంలో ఇదే జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కథ పరంగా చూస్తే రెండు పార్టులుగా తీసేంత స్టఫ్ అందులో లేదని తొలి రోజు నుంచి నెటిజన్లు చెబుతూ వచ్చారు. తారక్ వన్ మ్యాన్ షో, అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమా కలెక్షన్స్ పరంగా బాగా నెట్టుకొచ్చిందని పేర్కొన్నారు. కానీ తమ డబ్బులకు మాత్రం న్యాయం జరగలేదన్న ఫీలింగ్‌లో మెజారిటీ ఆడియన్స్ ఉన్నారు. ఇది గమనించిన ‘NTR 31’ ఆ రిస్క్ తీసుకోవద్దని భావించినట్లు సమాచారం.
ఎదురుచూపులకు చెక్
సాధారణంగా భారీ సక్సెస్ అందుకున్న చిత్రాలకే దర్శకులు సీక్వెల్స్ తీస్తుంటారు. రెండో పార్ట్‌కు సంబంధించిన సర్‌ప్రైజింగ్ లింక్‌ను తొలి భాగం ఎండ్‌లో పెట్టడం ద్వారా సీక్వెల్‌పై భారీగా అంచనాలు పెంచేస్తారు. ‘బాహుబలి’ నుంచి ఇది అందరూ చూస్తూ వచ్చిందే. అయితే కథను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆడియన్స్‌లో సదరు సినిమాపై పూర్తి సంతృప్తి అనేది వస్తుంది. ప్రస్తుతం సీక్వెల్స్ పరంపర కొనసాగుతుండటంతో రెండో భాగం చూస్తేనే అసలు కథ అంటే ఆడియన్స్‌కు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో పార్ట్ కోసం వారు నెలలు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా ఎదురు చూసి చూసి ఓ దశలో ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురయ్యే ప్రమాదం ఉంది. సెకండ్ పార్ట్స్ చూడాలన్న ఆసక్తి తమలో సన్నగిల్లుతున్నట్లు ఆడియన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘NTR 31’ విషయంలో తారక్- ప్రశాంత్ నీల్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
నవంబర్‌లో షూటింగ్!
NTR 31కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కథ కూడా ఆమ్‌మౌస్ట్ పూర్తైనట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో తారక్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. 2026 జనవరిలో 9న ఈ మూవీని లాంచ్ చేయాలని ప్రశాంత్ నీల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్. అందుకు తగ్గట్లు శరవేగంగా ఈ చిత్రాన్ని ఆయన ఫినిష్ చేస్తారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బంగ్లాదేశ్ నేపథ్యంలో..
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
ఆ మూవీస్ తర్వాత సెట్స్‌పైకి!
తారక్ బాలీవుడ్‌లో ‘వార్ 2’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోనూ తారక్ పాల్గొన్నాడు. ఈ సినిమాలో తన కోటా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ‘NTR 31’ను పట్టాలెక్కించాలని తారక్ భావిస్తున్నట్లు సమాచారం. ‘వార్ 2’ పూర్తయితే ఇక పూర్తిస్థాయిలో ప్రశాంత్ నీల్‌కు డేట్స్ అడ్డస్ట్ చేయవచ్చని తారక్ అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.