• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • NTR 31: ప్రశాంత్‌ నీల్‌ మూవీలో జూ.ఎన్టీఆర్‌ పాత్ర ఇంత వైలెంట్‌గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!

  ‘కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel).. త్వరలో జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)తో ఓ సినిమా చేయబోతున్నారు. ‘NTR 31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం తారక్‌.. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ (Devara) చిత్రం చేస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల తర్వాత ‘NTR 31’ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది. 

  రాక్షసుడిగా తారక్‌!

  ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న ‘NTR 31’ చిత్రాన్ని ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రం తారక్‌ కెరీర్‌లో 31వ సినిమాగా తెరకెక్కనుంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. తారక్‌ ఈ సినిమాలో నెగిటివ్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నరరూప రాక్షసుడిగా కనిపిస్తాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. తారక్‌ పాత్రను సరికొత్తగా డిజైన్‌ చేసినట్లు సమాచారం. ఆ పాత్ర కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే ‘సలార్‌ 2’ మెుదలు పెట్టాలని ప్రశాంత్‌ నీల్‌ ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. 

  పవర్‌ఫుల్‌ టైటిల్‌!

  NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం. 

  భారీ బడ్జెట్‌ చిత్రం

  తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న NTR 31 చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు అవుతుందని సమాచారం. రెమ్యూనరేషన్‌గా తారక్‌కు భారీ మెుత్తంలో ముట్టజెప్పే అవకాశముందని అంటున్నారు. కాగా, ఈ మూవీలో తారక్‌ సరసన రష్మిక మందన్న చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఇతర నటీనటులను కూడా ఫైనల్‌ చేస్తారని సమాచారం. 

  ‘దేవర’ రిలీజ్‌ ఎప్పుడంటే?

  క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. జనతా గ్యారేజ్‌ తర్వాత తారక్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) చేసింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ 10న దేవర రిలీజ్‌ కావాల్సి ఉండగా.. పనులు శరవేగంగా సాగుతుండటంతో సెప్టెంబర్‌ 27కు మార్చినట్లు చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv