ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) – డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). ప్రస్తుతం స్పీడ్‌గా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో అల్లు ఆర్మీ ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా డిసెంబర్ ఫస్ట్ వీక్ బరిలో ఇప్పటివరకూ ఏ సినిమా లేకపోడవంతో ఇక బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2’కి తిరుగుండదని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే బన్నీ చిత్రానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూపంలో గట్టి పోటీ ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ బరిలో బాలయ్య – బన్నీ ఒకరికొకరు తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పుష్ప 2 వర్సెస్ NBK 109..!
నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘NBK 109’ వర్కింగ్ టైటిల్‌తో చాలా స్పీడ్‌గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని సంక్రాతి కానుకగా బరిలోకి దింపాలని తొలుత మేకర్స్ భావించారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం నెల రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2న ‘NBK 109‘ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ వర్సెస్ నందమూరి బాలయ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
అఖండ సెంటిమెంట్!
డిసెంబర్ మెుదటి వీక్‌లోనే బాలయ్య తన చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఓ సెంటిమెంట్ కూడా దోహదం చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ (Akhanda Movie) చిత్రం సరిగ్గా మూడేళ్ల క్రితం డిసెంబర్ 2న విడుదలైంది. ఆ చిత్రం ఏ స్థాయి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘NBK 109’ని కూడా అదే రోజు రిలీజ్ చేస్తే ఆ మూవీ సైతం సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారట. మరోవైపు సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం నిలిచింది. జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు వెంకటేష్ – అనిల్ రావిపూడి చిత్రం, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ మూవీస్ సైతం సంక్రాంతి పోటీలో ఉన్నాయి. దీంతో జనవరి నుంచి ‘NBK 109’ వెనక్కి తగ్గాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ.. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాలని టాలీవుడ్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులను టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇన్విటేషన్ అందింది. బుధవారం ఆయనను అసోసియేషన్ల ప్రతినిధులు కలిసి అహ్వాన పత్రికను అందించారు. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి, రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ తదితరులను వేడుకలకు ఆహ్వానించారు. అలాగే తమిళ నటులు విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్‌లను కూడా ఆహ్వానాలు అందాయి.
బాలయ్య.. అన్‌స్టాపబుల్
నందమూరి బాలకృష్ణ గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతూనే ఉన్నారు. మొత్తం 109 సినిమాల్లో ఆయన నటించారు. అయితే బాలయ్య చేసిన సినిమాల కంటే ఆయన నటించిన హీరోయిన్స్ సంఖ్య చాలా ఎక్కువ. 109 సినిమాలకు గాను 129 మంది హీరోయిన్స్‌తో బాలయ్య నటించారు. ఇక ఆయన నటించిన సినిమాలు ఎన్నో 100 రోజులు ఆడాయి. 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఆయన కెరీర్లో ఉన్నాయి. సోషల్, పౌరాణిక, జానపద, బయోపిక్స్, సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్ డ్రామాలు, యాక్షన్ ఇలా అన్ని జానర్స్‌లో బాలకృష్ణ సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత కూడా బాలయ్య సొంతం. 25 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా కొనసాగుతూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్